పాతబస్తీ వరదలో గల్లంతైన నలుగురి మృతదేహాలు లభ్యం

భాగ్యనగరంలో రెండు రోజుల క్రితం కురిసిన వర్ష బీభత్సం అంత ఇంత కాదు... నగరంలోని ఎన్ని కాలనీలు నీట మునిగాయి. వందలాది మంది నిరాస్య్రులయ్యారు. వరద నీటిలో గల్లంతైన కొందరి ఆచూకీ ఇప్పటికి లభించలేదు.

పాతబస్తీ వరదలో గల్లంతైన నలుగురి మృతదేహాలు లభ్యం
Follow us

|

Updated on: Oct 16, 2020 | 11:25 AM

భాగ్యనగరంలో రెండు రోజుల క్రితం కురిసిన వర్ష బీభత్సం అంత ఇంత కాదు… నగరంలోని ఎన్ని కాలనీలు నీట మునిగాయి. వందలాది మంది నిరాస్య్రులయ్యారు. వరద నీటిలో గల్లంతైన కొందరి ఆచూకీ ఇప్పటికి లభించలేదు. అయితే, మైలార్‌దేవులప‌ల్లి ప‌ల్లెచెరువు వ‌ర‌ద‌లో కొట్టుకుపోయిన ఘ‌ట‌న‌లో నలుగురి మృత‌దేహాలు ల‌భించాయి. రెండుడురోజుల‌ క్రితం రాజేంద్ర‌న‌గ‌ర్ ప‌రిధిలోని మైలార్‌దేవుల‌ప‌ల్లి ప‌ల్లెచెరువు బుధ‌వారం నాటికి పూర్తిగా నిండి ప్ర‌మాద‌క‌ర‌స్థాయికి చేరింది. చెరువు క‌ట్ట‌పైనుంచి నీరు ఒక్క‌సారిగా అలుగు పారడంతో అలీన‌గ‌ర్‌లోని ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది గ‌ల్లంత‌య్యారు. వారికోసం గాలిస్తున్న అధికారుల‌కు ఈరోజు ఉద‌యం నాలుగు మృత‌దేహాలను గుర్తించారు. మ‌రో నలుగురి కోసం గాలింపు చర్యలు చేపడున్నట్లు అధికారులు తెలిపారు.

ఎగువ నుంచి భారీగా వ‌ర‌ద రావ‌డంతో ప‌ల్లెచెరువు పూర్తిగా నిండిపోయింది. దీంతో చెరువు క‌ట్ట తెగిపోయింది. అప్ర‌మ‌త్త‌మైన అధికారులు దిగువ ప్రాంతాల్లోని అలీన‌గ‌ర్‌, హ‌షామాబాద్‌, అల్ జుబుల్ కాల‌నీవాసుల‌ను అధికారులు అప్ర‌మ‌త్తం చేశారు. అయినప్పటికీ లోత‌ట్టు ప్రాంతాల్లో కాల‌నీలు పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. కాలనీల్లోని ప్ర‌జ‌ల‌ను సుర‌క్షిత ప్రాంతాల‌కు త‌ర‌లించారు అధికారులు. ఓఎస్ ఫంక్ష‌న్ హాల్‌లో పున‌రావాస కేంద్రం ఏర్పాటు చేశారు. వరద ప్రవాహం తగ్గుముఖం పట్టాక తిరిగి వారివారి ఇళ్లకు చేరుస్తామని అధికారులు చెబుతున్నారు.