యువకుడి మృతదేహంతో బంధువుల ధర్నా

Nellore Youth died. Family Members Protesting, యువకుడి మృతదేహంతో బంధువుల ధర్నా

నెల్లూరు జిల్లా బట్వాడిపాలెం జంక్షన్ వద్ద నిఖిల్ అనే యువకుడి మృతదేహంతో బంధువులు ధర్నాకు దిగారు. నిఖిల్‌ మృతికి పోలీసులే కారణమని ఆరోపిస్తూ మృతుడి తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు.. సెప్టెంబర్‌ 10న రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్ననిఖిల్‌ను పోలీస్ వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న నిఖిల్‌ని స్థానిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తుండగా..మర్నాడు చికిత్స పొందుతూ..నిఖిల్‌ ప్రాణాలు కొల్పోయాడు. దీంతో తమ కొడుకును పోలీసు వాహనం ఢీ కొట్టడం వల్లే చనిపోయాడని ఆరోపిస్తూ..మృతదేహంతో రోడ్డుపై భైఠాయించి ఆందోళనకు దిగారు. మృతుడి కుటుంబానికి న్యాయం జరిగేవరకు కదిలేదిలేదని బంధువులు, ప్రజా సంఘాలు డిమాండ్‌ చేశారు. అయితే యువకుడికి మూర్ఛ రావడం వలనే పడిపోయాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నామని చెప్పిన పోలీసు ఉన్నతాధికారులు..ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించే పనిలో ఉన్నామని..నిందితులను గుర్తించి..బాధితులకు తగిన న్యాయం చేస్తామని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *