Breaking News
  • ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ క్లీన్‌స్వీప్‌. జిల్లాలోని 9 మున్సిపాలిటీలు కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్‌. జనగాం, భూపాలపల్లి, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్‌.. వర్ధన్నపేట, డోర్నకల్‌, తొర్రూర్‌, మరిపెడలో టీఆర్‌ఎస్‌ విజయం. జనగాం: టీఆర్‌ఎస్‌-13, కాంగ్రెస్‌-10, బీజేపీ-4, ఇతరులు-3. భూపాలపల్లి: టీఆర్‌ఎస్‌-23, బీజేపీ-1, ఇతరులు-6. పరకాల: టీఆర్‌ఎస్‌-17, బీజేపీ-3, కాంగ్రెస్‌-1, ఇతరులు-1. నర్సంపేట: టీఆర్‌ఎస్‌-16, కాంగ్రెస్‌-6, ఇతరులు-2. తొర్రూరు: టీఆర్‌ఎస్‌-12, కాంగ్రెస్‌-3, బీజేపీ-1. వర్ధన్నపేట: టీఆర్‌ఎస్‌-8, కాంగ్రెస్‌-2, బీజేపీ-1, ఇతరులు-1. డోర్నకల్‌: టీఆర్‌ఎస్‌-11, కాంగ్రెస్‌-1, ఇతరులు-3. మహబూబాబాద్‌: టీఆర్ఎస్‌-19, కాంగ్రెస్‌-10, ఇతరులు-7. మరిపెడ: టీఆర్‌ఎస్‌-15.
  • రైతులపై దాడి చేయించిన జగన్‌ రైతు ద్రోహిగా మరింత దిగజారారు. మూడు రాజధానుల్లో ఆయన స్వార్థం తప్ప రాజధానులు లేవని.. ప్రజలకు అర్థమైందన్న ఆందోళన జగన్‌ను వెంటాడుతోంది-లోకేష్‌. వైసీపీ రౌడీలను రంగంలోకి దింపి జేఏసీ శిబిరానికి నిప్పంటించారు. తెనాలిలో వైసీపీ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం-నారా లోకేష్‌. జగన్‌ తాటాకు చప్పుళ్లకు భయపడేవారెవరూ లేరు-ట్విట్టర్‌లో నారా లోకేష్‌.
  • చిత్తూరు: గ్రేడ్‌-3 మున్సిపాలిటీగా కుప్పం గ్రామ పంచాయతీ. గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసిన ప్రభుత్వం. ఏడు గ్రామపంచాయతీలను కుప్పం మున్సిపాలిటీలో విలీనం. కుప్పం మున్సిపాలిటీలో చీలేపల్లి, దళవాయి కొత్తపల్లి, చీమనాయనపల్లి.. సామగుట్టపల్లి, తంబిగానిపల్లి, కమతమూరు, అనిమిగానిపల్లి విలీనం. చంద్రబాబు నియోజకవర్గానికి మున్సిపాలిటీ హోదా కల్పించిన ప్రభుత్వం.
  • కరీంనగర్‌: తిమ్మాపూర్‌ దగ్గర ఎస్సారెస్పీ కెనాల్‌లో కారు బోల్తా. కారులో ఉన్న దంపతులు మృతి. మృతులు సుల్తానాబాద్‌ వాసులుగా గుర్తింపు.
  • విశాఖ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా హై అలర్ట్. విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు భద్రత పెంపు.

జూనియర్ ఆర్టిస్టులను..టెర్రరిస్టులు అనుకుని

Fake terrorists create havoc on star hero’s sets, జూనియర్ ఆర్టిస్టులను..టెర్రరిస్టులు అనుకుని

ముంబయి: బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ నటిస్తున్న ఓ సినిమా సెట్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబయిలో జరుగుతోంది. సినిమాలో ఇద్దరు జూనియర్‌ ఆర్టిస్ట్‌లు ఉగ్రవాదుల పాత్రలు పోషిస్తున్నారు. దాంతో బుల్లెట్‌ ప్రూఫ్‌ వెస్ట్‌లు ధరించి, సూసైడ్‌ బాంబర్స్‌ గెటప్‌ను వేసుకున్నారు. చిత్రీకరణ సమయంలో కాస్త ఖాళీ సమయం దొరకడంతో ఇద్దరూ అవే గెటప్‌లతో పక్కనే ఉన్న ఓ దుకాణానికి వెళ్లారు. వారిని చూసిన స్థానికులు ఉగ్రవాదులు అనుకుని భయబ్రాంతులకు గురయ్యారు.

వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని ఆ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. తాము జూనియర్‌ ఆర్టిస్ట్‌లమని ఎంత చెప్పినా పోలీసులు వినలేదు. విషయం నిర్మాతల దృష్టికి రావడంతో వారు వెంటనే పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి జరిగిన విషయం చెప్పారు. వారు జూనియర్‌ ఆర్టిస్ట్‌లని ఆధారాలు చూపించిన తర్వాతే పోలీసులు వారిని వదిలేశారు. ఈ ఘటనతో చిత్రీకరణను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ సినిమాలో హృతిక్‌తో పాటు టైగర్‌ ష్రాఫ్‌ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు.