Breaking News
  • ఎన్‌ఆర్సీ బీజేపీ కార్యాలయంలో తయారుచేసే చట్టం కాదు. ఇప్పటికిప్పుడు కేవలం సీఏఏ గురించే ఆలోచిస్తున్నాం. ఎన్‌ఆర్సీపై ఇప్పుడు ఎలాంటి చర్చ జరపడం లేదు-మురళీధర్‌రావు. అసోంలో ఎన్‌ఆర్సీ విధానాన్ని సుప్రీంకోర్టు పర్యవేక్షిస్తోంది. అసోంలో అమలవుతున్న ఎన్‌ఆర్సీ విధానాలే.. దేశం మొత్తం మీద ఉంటుందని భావించలేం-మురళీధర్‌రావు. అసోంతో ఇతర రాష్ట్రాల పరిస్థితులను పోల్చలేం. -బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు.
  • చిత్తూరు: సోమల అటవీప్రాంతంలో ప్రేమజంట ఆత్మహత్య. చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న హేమలత, ముని. పది రోజుల నుంచి కనిపించకుండా పోయిన హేమలత, ముని. ఇంటర్‌ చదువుతున్న హేమలత, ఆటో నడుపుతున్న ముని.
  • తూ.గో: రంపచోడవరం మండలం చిలకమామిడిలో గిరిజనుల ఆందోళన. సోమిరెడ్డి అనే వ్యక్తి మృతదేహంలో ఐటీడీఏ ఎదుట ఆందోళన. రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి సూరింటెండెంట్‌పై.. చర్యలు తీసుకోవాలని పీవోని కలిసిన సోమిరెడ్డి బంధువులు, గ్రామస్తులు. సరైన వైద్యం అందుబాటులోలేక ప్రాణాలు పోతున్నాయంటున్న గ్రామస్తులు.
  • మావోయిస్టు పార్టీల నేతలు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు మావోయిస్టుల నేతల అక్రమ వసూళ్లకు ప్రజలు సహకరించొద్దు మావోయిస్టు నేతలకు అక్రమంగా డబ్బులు వసూలు చేసే.. సర్వేష్‌, పెద్దిరెడ్డిని పోలీస్‌ ఇన్‌ఫార్మర్లుగా చిత్రీకరించారు మావోయిస్టు ఉత్తరాలు అందిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలి -భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్‌
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 8 గంటల సమయం. ఈ రోజు శ్రీవారిని దర్శించుకున్న 35,223 మంది భక్తులు. ఈ రోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.02 కోట్లు.
  • సూర్యాపేట: హుజూర్‌నగర్‌లో చిన్నారి శ్రావ్య అదృశ్యం. 26 రోజుల నుంచి కనిపించకుండా పోయిన శ్రావ్య. పీఎస్‌లో ఫిర్యాదు చేసిన శ్రావ్య తండ్రి సాంబశివరావు.

ఎన్నికల తర్వాత కూడా అదే ఫేక్ న్యూస్ !

Socila Media, ఎన్నికల తర్వాత కూడా అదే ఫేక్ న్యూస్ !

అదేం ఖర్మో ! లోక్ సభ ఎన్నికల ముందు.. ఆ తరువాత కూడా దేశంలో… సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ అవుతోంది. రెండో సారి ప్రధానిగా మోదీ ఢిల్లీ పీఠం ఎక్కబోతున్నందుకు అనేక చోట్ల బీజేపీ నేతలు, కార్యకర్తలు సెలబ్రేషన్స్ చేసుకోగా..కొంతమంది ఇదే అదననుకుని తప్పుడు (ఫేక్) వార్తల మీద పడ్డారు. లండన్ సిటీ బస్సులపై ‘ వెల్ కమ్ మోదీజీ ‘ అన్న పదాల పోస్టుతో కూడిన ఫోటోను వీరు సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. అంటే లండన్ లోనూ మోదీ అభిమానులు ఇలా హల్చల్ చేశారన్నది ఈ పోస్టు సారాంశం. కానీ ఇలాంటి పోస్టులపై నిజ నిర్ధారణ చేసే ‘బూమ్ ‘ సైట్ ఇందులోని వాస్తవాన్ని తెలుసుకుంది.. నిజానికి 2015 లో బ్రిటన్ లోని భారతీయులు ‘ మోదీ ఎక్స్ ప్రెస్ ‘ పేరిట ఓ బస్సును లాంచ్ చేసినప్పటి ఇమేజీలను ఈ ఫేక్ న్యూస్ లో వాడినట్టు వెల్లడైంది. అలాగే… మోదీ మళ్ళీ గెలిచారన్న సంతోషంతో గుజరాత్ కు చెందిన ఓ వ్యక్తి కెనడాలోని మిల్టన్ లో ప్రజలపై కరెన్సీ నోట్లను వెదజల్లాడంటూ ఫేస్ బుక్ లో ఓ వీడియో ప్రత్యక్షమైంది. మోదీ ఘన విజయంతో షేర్ మార్కెట్ భారీగా పుంజుకున్న కారణంగా ఈ వ్యక్తికి పెద్ద ఎత్తున లాభం వచ్చిందన్నక్యాప్షన్ ఈ వీడియోకు జోడించారు. వైరల్ గా అయిన ఈ వీడియో..అసలు .. . అమెరికా… డెట్రాయిట్ లోని ఒకరి ట్విటర్ ఖాతాకు సంబంధించినదని తేలింది. ఒరిజినల్ గా న్యూయార్క్ లో షూట్ చేసిన ఈ వీడియోను..ఇండియాలో ఎన్నికల ఫలితాల వెల్లడికి ముందే అప్ లోడ్ చేశారని, బీజేపీ విజయానికి, దీనికి సంబంధం లేదని నికార్సయిన నిజం బయటికొచ్చింది. ఇలాగే ఎన్నికల ఫలితాలు వెల్లడైన ఈ నెల 23 న మోదీ తన తల్లి దగ్గరకు వెళ్లి ఆమె ఆశీస్సులు తీసుకున్నారనే వీడియో వైరల్ అయింది. కానీ ‘ ఆల్ట్ న్యూస్ ‘ చెకింగ్ సైట్ కథనం ప్రకారం.. ఇది 2014 నాటిదని తెలిసింది. ఇంకో ఫేక్ న్యూస్.. మోదీ మళ్ళీ ఈ దేశ ప్రధాని అయితే తాను దేశాన్ని వదిలి వెళ్తానంటూ బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ గతంలో (2018 ఏప్రిల్ ఫూల్స్ నాడు) చేసిన కామెంట్ ను వక్రీకరించి తాజాగా పోస్ట్ చేశారని కూడా స్పష్టమైంది. ఇలాగే ఇంకా ఎన్నో అవాస్తవిక, తప్పుడు పోస్టులు సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. బహుశా మోదీ అభిమానులే ఆనందం పట్టలేక వీటిని పోస్ట్ చేసి ఉండవచ్చునని భావిస్తున్నారు.

Related Tags