వేప చెట్టుకు నీళ్లు పోస్తే.. కరోనా రాదట..

కరోనా రాకుండా చేయాలంటే ఓ పని చేయాలంటూ సోషల్ మీడియాలో పలు మూఢ నమ్మకాలు జోరుగా వైరల్ అవుతున్నాయి. పట్టణాల నుంచి గ్రామాల వరకూ ఈ నమ్మకాలను..

వేప చెట్టుకు నీళ్లు పోస్తే.. కరోనా రాదట..
Follow us

| Edited By:

Updated on: Mar 24, 2020 | 4:38 PM

ఓ వైపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న దీన్ని అరికట్టడానికి కష్టపడుతుంటే.. మరోవైపు వైరస్ పేరిట పలు ఫేక్ వార్తలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. చాప కింద నీరులాగా విజృంభిస్తోన్న ఈ కరోనాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఇందులో భాగంగానే ప్రజలను ఇళ్లకే పరిమితం కావాలని.. అప్పుడు ఈ వైరస్‌ని కట్టడి చేయవచ్చిని పేర్కొంటున్నారు. కానీ కొందరు లెక్క చేయకుండా రోడ్ల మీదకు వస్తున్నారు. దీంతో అధికారులు వారిపై తగిన చర్యలను తీసుకుంటున్నారు.

ఇప్పటికే సోషల్ మీడియాలో ఫేక్ వార్తలను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. మరోపక్క కరోనా రాకుండా చేయాలంటే ఓ పని చేయాలంటూ సోషల్ మీడియాలో పలు మూఢ నమ్మకాలు జోరుగా వైరల్ అవుతున్నాయి. పట్టణాల నుంచి గ్రామాల వరకూ ఈ నమ్మకాలను పాటిస్తున్నారు. ‘అదేంటో తెలుసా.. ఒకరిద్దరు కొడుకులున్న తల్లులు.. ఐదు ఇళ్లల్లోంచి తీసుకొచ్చిన నీటిని వేప చెట్టుకు పోస్లే కరోనా రాదంటూ ముమ్మరంగా ప్రచారం జరుగుతోంది’.

దీంతో కొందరు నమ్మేసి వేప చెట్టుకి నీళ్లు పోస్తున్నారు. అలాగే.. మరికొందరు ఒక్క కుమారుడుంటే ఒక కొబ్బరికాయ.. ఇద్దరుంటే రెండు కొబ్బరి కాయలు వేప చెట్టుకు కొడుతున్నారు’. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో ఎంత మాత్రం సత్యం లేదని అంటున్నారు విజ్ఞాన వేత్తలు. ఇంకా ప్రమాదం సోకే అవకావం ఎక్కువగా ఉందట. ఎందుకంటే అందరూ ఒకే చోటకి వెళ్తే.. వారిలో ఎవరికైనా కరోనా ఉంటే.. అది సోకే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లోనే ఉండి పలు జాగ్రత్తలు తీసుకోవడం మంచదని చెబుతున్నారు.

Read more also: కరోనా బాధితులు తినే ఆహారం ఇదే

రీజన్ లేకుండా.. రోడ్డెక్కితే అంతే.. ప్రజలకు సీరియస్ వార్నింగ్

మీరు సూపరంటూ కేసీఆర్‌ని పొగిడేసిన అమిత్‌ షా

కరోనాను జయించాలంటే.. ఈ డైట్‌ని మెయిన్‌టైన్ చేయాల్సిందే

కరోనా రూపంలో.. చిత్ర సీమకు తీవ్ర నష్టం

నగదు.. బియ్యం పంపిణీ ఎలా చేస్తారు?

92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
92.68 శాతం రైతులకు రైతుబంధు నిధులు: మంత్రి తుమ్మల
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
క్రియేటివిటీకా బాప్ ఈ చాయ్ పే చర్చ 2.0.. సామాన్యుడు టు సెలబ్రిటీ
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
ఎస్‌బీఐ ఖాతాదారులకు అలర్ట్‌.. ఈ పథకం మార్చి 31తో ముగియనున్న గడువు
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
దంచికొడుతున్న ఎండలు.. వడదెబ్బను నివారించే బెస్ట్ టిప్స్ ఇవే..
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
'నువ్వు మారిపోయావు భయ్యా'..ఓవర్ యాక్షన్ స్టార్ నుంచి సూపర్ స్టార్
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
ఈ బైక్ ఫ్లిప్‌కార్ట్‌లో 60 వేల కంటే తక్కువే.. మైలేజ్ 70 కిమీ
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
జీతం తక్కువైనా పర్లేదు ఆ భారం తగ్గించాలంటున్న ఉద్యోగులు
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
ఎమ్మిగనూరులో సీఎం జగన్.. 'మేమంతా సిద్దం' సభకు తరలివచ్చిన జనం..
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
వామ్మో ఎంత పెద్ద కొండచిలువ..! ఏం మింగిందో ఏమో..ఇలా ఇరుక్కుపోయింది
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ
దా‘రుణ’సమస్యలు వేధిస్తున్నాయా? ఈ టిప్స్‌తో రుణ చెల్లింపు ఈజీ