Breaking News
  • భారత్ లో కరోనా కల్లోలం. 9 లక్షల 6 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 906752 దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 311565 కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 571460 దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 23727 కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • అమరావతి ఏపీలో పదో తరగతి విద్యార్థులు ఆల్ పాస్. ఉత్తర్వులు జారీ చేసిన జగన్ సర్కార్. పదో తరగతి విద్యార్ధులందర్ని పాస్ చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించిన ప్రభుత్వం. పదో తరగతి పరీక్షల హాల్ టిక్కెట్ పొందిన ప్రతి ఒక్కరిని పాస్ చేసేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా శాఖ కమిషనరుకు ఆదేశాలు.
  • కరోనా టైం లో కంత్రీగాళ్ళు . కరోనా కు మందు అమ్మకాలు అంటూ మోసం . యాంటీ వైరల్ డ్రగ్ పేరిట దందా . 35 లక్షల విలువ చేసే యాంటీ వైరల్ డ్రగ్స్ స్వాధీనం . 8 మంది ని అరెస్ట్ చేసిన సౌత్ జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు.
  • అమరావతి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో కరోనా వ్యాప్తినిరోధక చర్యలు . పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ప్రధాన కార్యాలయానికి ఎవ్వరూ రావద్దని సర్కులర్ జారీ . విభాగాధిపతి హోదాలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని పీఆర్ఆర్డీ కార్యాలయాల అధికారులు, ఉద్యోగులు సిబ్బందికి ఆదేశాలు . ఆదేశాలు జారీ చేసింది ఆ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ .
  • విశాఖ: టీవీ9 తో ఫైర్ సేఫ్టీ అధికారి రాం ప్రకాష్. ఈ ఘటనకు సంబంధించి రాత్రి విశాఖ సాల్వేట్స్ నుండి 10.40కి మెసేజ్ వచ్చింది. ఈ ప్రమాదాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నాం,ఎక్కువ అగ్ని స్ప్రీడ్ అవ్వకుండా ప్రమాదాన్ని నివరించగలిగాం . మానవ తప్పిదాలు వల్ల ఎలాంటి ఘటనలు జరుగుతాయి. ఒకరు చేసే పొరపాటు వల్ల ఇండస్ర్టీకి చెడ్డపేరు వస్తోంది, మనం బాధ్యతగా తీసుకుంటే ఎలాంటి ప్రమాదం సంభవించదు.
  • అమరావతి: టిడిపి ఎమ్మెల్సిలు పోతుల సునీత, శివనాథ రెడ్డిల అనర్హత పిటిషన్ లపై మండలి ఛైర్మన్ వద్ద విచారణ. ఆరోగ్య కారణాల దృష్ట్యా విచారణ కి హాజరు కాని సునీత, శివనాథ రెడ్డి. వారి తరపున లాయర్లు హాజరు విచారణకు టీడీపీ తరపున హజరయిన పిటిషనర్ బుద్దా వెంకన్న, అశోక్ బాబు.
  • తిరుపతి: ఏపీ సీఎం కు ఆంధ్రప్రదేశ్ డాక్టర్స్ అసోసియేషన్ లేఖ. కోవిడ్ విధుల్లో ఉన్న ప్రభుత్వ వైద్యులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి. విధినిర్వహణలో చనిపోయిన డాక్టర్లకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి పరిహారం ప్రకటించలేదని లేఖలో పేర్కొన్న ప్రభుత్వ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ వెంకటేశ్వర్లు.
  • శ్రీరాముని జన్మభూమిపై నేపాల్ వ్యాఖ్యలను ఖండించిన విశాఖ శారదా పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర. రాముడు భారతీయుల ఆరాధ్య దైవం. ధర్మబద్ధమైన జీవితాన్ని సమాజానికి అందించిన దివ్యమూర్తి శ్రీరాముడు. భారత్ లో జన్మించి ప్రపంచానికే నడవడికను నేర్పాడు శ్రీరాముడు. శ్రీరాముని గురించి తెలిసీ తెలియని మాటలు తగదు. -స్వరూపానంద

‘వేలిముద్రల ఆపరేషన్’.. క్రైమ్ రేట్‌లో నయా దందా!

Fake Fingerprint Scam, ‘వేలిముద్రల ఆపరేషన్’.. క్రైమ్ రేట్‌లో నయా దందా!

అబ్బబ్బ..క్రైమ్ చెయ్యడానికి జనాలు ఓ రేంజ్‌లో తెలివిని ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు మేము చెప్పబోయే క్రైమ్ వింటే ప్రతి వ్యక్తి షాక్‌కి గురవ్వాల్సిందే. ఇదే ఇంటిలిజెన్స్ బాగుపడటానికి ఉపయోగిస్తే బాగుండు.  ఇన్నాళ్లు వేలిముద్రల ఆధారంగా పోలీసులు నేరస్థులను పట్టుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు పింగర్ ప్రింట్స్‌ని కూడా మార్చేస్తున్నారు కేటుగాళ్లు. ఈ ఘటన చూశాక అసలు ఇలా కూడా క్రైమ్ చేయవచ్చా? అని విస్తుపోవడం పోలీసుల వంతయ్యింది. డబ్బు కోసం ఏకంగా చేతి వేళ్లపై ముద్రలనే తారుమారు చేస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. చేతివేళ్లకు గాయాలు చేసి, అవి మానిన తర్వాత ఏర్పడిన కొత్త వేలి ముద్రలతో తిరిగి ఆధార్‌, పాస్‌పోర్ట్‌లు సంపాదించి అక్రమాలకు పాల్పడుతున్నారు.

అంతర్జాతీయ వ్యవస్థలను సైతం బోల్తా కొట్టించి.. నకిలీ వేలిముద్రల సహాయంతో కొత్త క్రైమ్‌కి తెరతీసిన మాయగాళ్ల ఆటని పోలీసులు కట్టించారు. చేతి వేళ్లపై ఉన్న చర్మాన్ని లోతుగా కోయడం, సర్జరీ చెయ్యడం, కొత్త వేలిముద్రలు సృష్టించడం..వాటి సహాయంతో నకిలీ ఆధార్, పాస్‌పోర్ట్ పొంది విదేశాలకు ఎగిరిపోవడం ఈ ముఠా స్టైల్. ఇదే తరహాలో దాదాపు 70 మందిని విదేశాలకు పంపించింది ఈ క్రైమ్ ముఠా. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్వాప్తు చేయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..దేశంలోని వివిధ స్టేట్స్‌కు తమ పరిధిని విస్తరించుకున్నారు ఈ కేటుగాళ్లు.

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు మండలం బుగ్గేశ్వరానికి చెందిన రాంబాబు 2012లో కువైట్‌ వెళ్లాడు. అక్కడ సారా వ్యాపారం చేస్తూ పోలీసులకు దొరికిపోగా.. అతడిని భారత్‌కు తిప్పి పంపారు. ఆ సమయంలో రాంబాబు వేలి ముద్రలు నమోదు చేసుకొని… ఆ దేశానికి తిరిగి రాకుండా నిషేధం విధించారు. కువైట్‌లో ఉండగానే రాంబాబుకు పరిచయమైన మహ్మద్‌ బాషా, ఖాదర్‌ బాషా, ముజఫర్‌ సహకారంతో వేలి ముద్రలు తారుమారు చేసి బండి రాజేష్‌ పేరుతో నకిలీ పాస్‌పోర్ట్‌ పొందాడు. తిరిగి సునాయాసంగా కువైట్‌ వెళ్లి… ఆ ముగ్గురితో ముఠాగా ఏర్పడి… నకిలీ వేలిముద్రల సృష్టినే వ్యాపారంగా మార్చుకున్నాడు.

నకిలీ వేలిముద్రల తయారీలో భాగంగా… ముందుగా చేతివేళ్లపై అడ్డంగా, నిలువుగా కోతలు పెట్టి  కుట్లు వేస్తారు. 2 నెలల తర్వాత గాయాలు మాని పాతవాటి స్థానంలో గాయాల వలన  కొత్తవి ఏర్పడతాయి. ఆ తర్వాత నకిలీ పేర్లు, వివరాలతో సునాయాసంగా ఆధార్‌, పాస్‌పోర్ట్‌ పొందేవారు. ఇలా చేసినందుకు ఒక్కొక్కరి వద్ద 5లక్షల రూపాయలు సమర్పించుకోవాలి. అయితే దొడ్డిదారిన అక్కడికి వెళ్లినవారు..ఆయా దేశాల్లో ఏమైనా క్రైమ్‌కి పాల్పడుతున్నారా? అసలు ఏయే కంట్రీస్‌కి ఇక్కడనుంచి వెళ్లారు. వీరికి డైరక్షన్స్ ఇస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ముఠా సభ్యులైన బొక్కా రాంబాబు, ఆర్‌ఎంపీ వైద్యుడు వీరా త్రిమూర్తులు, కోడెంరెడ్డి రాజిరెడ్డి, షేక్ మహ్మద్ సహా శ్రీలంకకు చెందిన జాకీర్‌ హుస్సేన్‌ అనే వ్యక్తిని రప్పించి వివరాలు సేకరిస్తున్నారు. రాంబాబు ఈ ముఠా ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న ఇంటిలిజెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు.

 

Related Tags