Breaking News
  • అమరావతి: కరోనా నియంత్రణకు ప్రభుత్వ కీలక నిర్ణయం. ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజ్‌లు, ఆస్పత్రుల ఉపయోగించుకోవాలని నిర్ణయం. ప్రైవేట్‌ ఆస్పత్రులు కలెక్టర్ల ఆదేశాలతో పనిచేయాలని ఉత్తర్వులు.
  • విజయవాడ: కరోనాపై యుద్ధానికి ప్రజలు సహకరించాలి. రేషన్‌ షాపుల దగ్గర సామాజిక దూరం పాటించాలి. రైతు బజార్లలో రద్దీ తగ్గించేందుకు వికేంద్రీకరణ చేపట్టాం. అందరికీ రేషన్‌ సరఫరా చేస్తాం-జాయింట్‌ కలెక్టర్‌ మాధవీలత.
  • వలస కూలీలపై కేంద్రాన్ని నివేదిక కోరిన సుప్రీంకోర్టు. ఎలాంటి ఏర్పాట్లు చేశారో చెప్పాలన్న సుప్రీంకోర్టు. తదుపరి విచారణ రేపటికి వాయిదా.
  • ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రికి పెరుగుతున్న కేసులు. మద్యం దొరకక వింతగా ప్రవర్తిస్తున్న మందుబాబులు. ఎర్రగడ్డ ఆస్పత్రికి రోగుల తాకిడి. ఓపీకి 100కు పైగా వచ్చిన బాధితులు.
  • కర్ణాటక లో వాట్సప్ వైద్య సేవలు. మంగళూరులో డేరలకట్టేలోని జస్టిస్ కె.ఎస్. హెగ్డే ఛారిటబుల్ హాస్పిటల్ వాట్సాప్ లో టెలి-మెడిసిన్ సేవలను ప్రారంభించింది. కరోనా లాక్ డౌన్ సమయంలో రోగులకు వైద్య సలహాలను ఇవ్వడానికి వాట్సప్ సేవలు ప్రారంభం.

Fake currency : ఒంగోలులో నకిలీ కరెన్సీ..ఇలా కూడా మోసం చేస్తారా..?

ఒంగోలులో నకిలీ కరెన్సీ కలకలం సృష్టిస్తోంది. చిల్లర కావాలంటూ వచ్చిన ఓ వ్యక్తి ఏకంగా రూ. 31 వేలకు డెయిరీ యజమానిని బురిడీ కొట్టించాడు. నగరంలోని వెజిటేబుల్ మార్కెట్ వద్ద వెంకట సుబ్బారెడ్డి అనే వ్యక్తి దొడ్ల పాల డెయిరీ ఫామ్‌ను నడుపుతున్నాడు.
Fake currency kingpin nabbed in Prakasam district, Fake currency : ఒంగోలులో నకిలీ కరెన్సీ..ఇలా కూడా మోసం చేస్తారా..?

Fake currency :  ఒంగోలులో నకిలీ కరెన్సీ కలకలం సృష్టిస్తోంది. చిల్లర కావాలంటూ వచ్చిన ఓ వ్యక్తి ఏకంగా రూ. 31 వేలకు డెయిరీ యజమానిని బురిడీ కొట్టించాడు. నగరంలోని వెజిటేబుల్ మార్కెట్ వద్ద వెంకట సుబ్బారెడ్డి అనే వ్యక్తి దొడ్ల పాల డెయిరీ ఫామ్‌ను నడుపుతున్నాడు. షాపులో ఉన్న అతని వద్దకు గురువారం రాత్రి ఓ వ్యక్తి వచ్చి తన వద్ద పెద్ద నోట్లు పెద్ద మొత్తంలో ఉన్నాయని..చిల్లర కావాలని కోరాడు. తనకు దుకాణం ద్వారా వచ్చిన చిల్లర నోట్లు చాలా ఉన్నాయని భావించిన షాపు యజమాని..అందుకు సరే అన్నాడు. తన వద్ద ఉన్న 100 రూపాయల నోట్లు 340 ఇచ్చాడు. షాపుకు వచ్చిన ఆగంతకుడు తన వద్ద ఉన్న 500 నోట్లు 68 సుబ్బారెడ్డికి ఇచ్చాడు. అయితే సుబ్బారెడ్డి డబ్బులు లెక్కపెట్టుకోవాలని అవతలి వ్యక్తిని కోరగా, ఇంటికి వెళ్లి మెషీన్‌లో లెక్కబెట్టుకుంటానంటూ సదరు వ్యక్తి వెళ్లిపోయాడు.

ఇక్కడే సుబ్బారెడ్డికి అనుమానం కలిగింది. అంత పెద్ద మొత్తం డబ్బు తీసుకుని కనీసం లెక్కేసుకోకుండా ఎలా వెళ్తున్నాడా అని మనసులో అనుకోని..తనకిచ్చిన నోట్లను మరోసారి జాగ్రత్తగా పరిశీలించాడు. మొదటి 6 నోట్లు మినహా..మిగతా వాటిపై ఒకే నెంబర్ ఉండటంతో షాక్‌కు గురయ్యాడు. మోసపోయానని తెలుసుకోని వెంటన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి..జరిగిన మోాసాన్ని చెప్పి వాపోయాడు. ఒకే నెంబర్‌తో ఉన్న 62  జిరాక్స్ నోట్లు సీఐకి అందజేశాడు. దీంతో మొత్తం రూ. 31 వేలకు సుబ్బారెడ్డి మోసపోయినట్టు పోలీసులు గుర్తించారు. వెంటనే అలర్టయ్యి.. సీసీ కెమెరాల ఫుటేజ్ ద్వారా నిందితుడుని పట్టుకునేందుకు గాలిస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు రూ. 7 లక్షల పరిహారం

 

Related Tags