నీతా అంబానీ పేరుతో ఫేక్ ట్వీట్స్… ట్విట్టర్ క్లోజ్

సోషల్ మీడియా.. దీనివల్ల సమాజానికి ఎంత ఉపయోగం ఉందో.. అంతే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే అందులో వచ్చే సమాచారం నిజమో కాదో అన్నది తెలియడం కష్టమే. కొంతమంది ఆకతాయిలు.. ప్రముఖుల పేరుతో పోస్టులు పెడుతూ పైశాచికానందాన్ని పొందుతుంటారు. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ పేరుతో ట్విట్టర్‌లో కొన్ని పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. అవి కూడా అలాంటి ఇలాంటి పోస్టులు కాదు.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా […]

నీతా అంబానీ పేరుతో ఫేక్ ట్వీట్స్... ట్విట్టర్ క్లోజ్
Follow us

| Edited By:

Updated on: Dec 26, 2019 | 1:08 PM

సోషల్ మీడియా.. దీనివల్ల సమాజానికి ఎంత ఉపయోగం ఉందో.. అంతే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే అందులో వచ్చే సమాచారం నిజమో కాదో అన్నది తెలియడం కష్టమే. కొంతమంది ఆకతాయిలు.. ప్రముఖుల పేరుతో పోస్టులు పెడుతూ పైశాచికానందాన్ని పొందుతుంటారు. తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సతీమణి, రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్ పర్సన్ నీతా అంబానీ పేరుతో ట్విట్టర్‌లో కొన్ని పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. అవి కూడా అలాంటి ఇలాంటి పోస్టులు కాదు.. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్‌టాపిక్‌గా ఉన్న పౌరసత్వ సవరణ చట్టం అంశానికి సంబంధించిన పోస్టులు. కొందరు దుండగులు నీతా అంబానీ పేరుతో ఓ ట్విట్టర్ అకౌంట్ ఓపెన్‌ చేసి CAAపై తప్పుడు ట్వీట్లు చేశారు.

అయితే ఆ ట్వీట్స్ వైరల్ అవ్వడంతో.. విషయం తెలుసుకున్న రిలయన్స్.. దీనిపై స్పందించింది. నీతా అంబానీ పేరుతో.. ఎలాంటి అధికారిక ట్విటర్ అకౌంట్ లేదని.. నీతా పేరిట వైరల్ అవుతున్న ట్వీట్స్‌పై.. ట్విటర్ ఇండియా విభాగానికి ఫిర్యాదు చేసింది. దీనిపై వెంటనే స్పందించిన ట్విటర్.. నీతా పేరుతో ఉన్న ఫేక్ అకౌంట్లను సస్పెండ్ చేసింది.