అయోధ్య కేసు.. ముస్లిం మత గురువు ధీమా

వివాదాస్పదమైన, రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిన అయోధ్య కేసులో వాద, ప్రతివాదనలు ముగిశాయి. ఈ నెల 17 లోగా సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి తుది తీర్పునివ్వనుంది. అదేరోజున చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ రిటైర్ కానున్న నేపథ్యంలో.. దేశమంతా తీర్పు కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. ఈ సందర్భంగా దేశంలో అతి పెద్ద ముస్లిం సంస్థ జమాయిత్-ఉలేమా-హింద్ కు చీఫ్ అయిన అర్షద్ మదానీ.. కోర్టు తీర్పు వాస్తవాలు, ఆధారాలపై ఉండాలి తప్ప.. విశ్వాసాలు నమ్మకాలపై కాదని […]

అయోధ్య కేసు.. ముస్లిం మత గురువు ధీమా
Follow us

|

Updated on: Nov 07, 2019 | 11:28 AM

వివాదాస్పదమైన, రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారిన అయోధ్య కేసులో వాద, ప్రతివాదనలు ముగిశాయి. ఈ నెల 17 లోగా సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించి తుది తీర్పునివ్వనుంది. అదేరోజున చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ రిటైర్ కానున్న నేపథ్యంలో.. దేశమంతా తీర్పు కోసం ఉత్కంఠతో ఎదురుచూస్తోంది. ఈ సందర్భంగా దేశంలో అతి పెద్ద ముస్లిం సంస్థ జమాయిత్-ఉలేమా-హింద్ కు చీఫ్ అయిన అర్షద్ మదానీ.. కోర్టు తీర్పు వాస్తవాలు, ఆధారాలపై ఉండాలి తప్ప.. విశ్వాసాలు నమ్మకాలపై కాదని అన్నారు. ఈ దేశ ప్రజలు శాంతి, సామరస్యాలతో ఉండాలి.. తీర్పు మాకు వ్యతిరేకంగా ,ఉన్నా.. దాన్ని గౌరవిస్తాం అని ఆయన పేర్కొన్నారు. న్యాయం పట్ల విశ్వాసం ఉన్న ప్రతి వ్యక్తీ విశ్వాసాలు, నమ్మకాలను కాకుండా వాస్తవాలనే పరిగణనలోకి తీసుకోవాలని, తమ లాయర్ రాజీవ్ ధావన్.. గట్టిగా కోర్టులో వాదించారని మదానీ పేర్కొన్నారు. తీర్పు మాకు అనుకూలంగా వస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు.

ఢిల్లీలో ఆర్ఎస్ఎస్ నేతలు ముస్లిం మతగురువులతో సమావేశం జరిపిన మరుసటిరోజే మదానీ ఈ వ్యాఖ్యలు చేశారు. అటు-అయోధ్యలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాపై నిఘా ఉంచేందుకు ఫైజాబాద్ పోలీసులు 16 వేల మంది వలంటీర్లను నియమించారు. తీర్పు ముందు గానీ, అనంతరం గానీ సోషల్ మీడియాలో వచ్ఛే తప్పుడు.. లేదా వాస్తవ దూరమైన.. లేదా రెచ్చగొట్టే సమాచారాన్ని, కంటెంట్ ను పసిగట్టి ఈ వలంటీర్లు పోలీసులకు తెలియజేస్తారు. అలాగే ఉగ్రదాడులు, మత ఘర్షణలు , వివాదాస్పద స్థలంపై దాడులు వంటివి జరగకుండా తాము అన్ని చర్యలూ తీసుకున్నట్టు ఖాకీలు తెలిపారు. నాలుగంచెల సెక్యూరిటీ ప్లాన్ ను సిధ్ధం చేశారు. తప్పుడు సమాచారాన్ని, ద్వేష పూరిత ప్రచారాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందింపజేసేవారిని జాతీయ భద్రతా చట్టం కింద అరెస్టు చేయనున్నారు.