బోటు ప్రమాద బాధితులకు ఎన్టీఆర్ ఆర్థిక సాయం.. వైరల్లో వార్తల్లో నిజమెంత..!

ఈ నెల 15న ఏపీలో తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని మంటూరు- కచ్చులూరు మధ్య ఓ ప్రైవేట్ బోటు బోల్తా పడిన ఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి 26మంది సురక్షితంగా బయటపడగా.. 39 మృతదేహాలను వెలికి తీశారు. మరో 13మంది మృతదేహాల కోసం అధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మరోవైపు దాదాపు 215 అడుగుల లోతులో(315 అడుగుల లోతులో ఉందన్నది మరికొందరి అభిప్రాయం) ఉన్న బోటును […]

బోటు ప్రమాద బాధితులకు ఎన్టీఆర్ ఆర్థిక సాయం.. వైరల్లో వార్తల్లో నిజమెంత..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 25, 2019 | 4:48 PM

ఈ నెల 15న ఏపీలో తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలోని మంటూరు- కచ్చులూరు మధ్య ఓ ప్రైవేట్ బోటు బోల్తా పడిన ఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి 26మంది సురక్షితంగా బయటపడగా.. 39 మృతదేహాలను వెలికి తీశారు. మరో 13మంది మృతదేహాల కోసం అధికారులు గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మరోవైపు దాదాపు 215 అడుగుల లోతులో(315 అడుగుల లోతులో ఉందన్నది మరికొందరి అభిప్రాయం) ఉన్న బోటును బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నాలను చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే ఈ ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు టాలీవుడ్ టాప్ హీరో ఎన్టీఆర్ సాయం చేశాడని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.

ఒక్కో కుటుంబానికి ఎన్టీఆర్ రూ.5లక్షలను ఇచ్చినట్లు ఓ వార్తను కొందరు ప్రచారం చేశారు. దీనిని ఎన్టీఆర్ అభిమానులు వైరల్ చేస్తూ.. జై ఎన్టీఆర్.. ఎన్టీఆర్ అభిమానిగా గర్విస్తున్నా అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఆ వార్తలన్నీ అబద్ధాలని ఎన్టీఆర్ సన్నిహితుల నుంచి సమాచారం. ఎన్టీఆర్ అభిమానులు కొంతమంది అత్యుత్సాహంతో ఇలాంటి పోస్ట్‌లు పెట్టి వైరల్‌ చేస్తున్నారని వారు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఏదైనా ప్రకృతి విపత్తు జరిగినప్పుడు టాలీవుడ్‌లోని హీరో, హీరోయిన్లందరూ సాధారణంగా స్పందిస్తుంటారు. బాధితులకు తోచినంత సాయం అందిస్తుంటారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎన్టీఆర్ పేరుతో ఇలాంటి పోస్ట్‌లు పెట్టారని ఫిలింనగర్‌లోని కొందరు అంటున్నారు. అయితే ఇది పక్కనపెడితే ఎన్టీఆర్‌కు సాయం చేసే గుణం ఎక్కువే. ఇది వరకు పలు విపత్తులు సంభవించినప్పుడు ఆయన కొన్ని లక్షల సాయాన్ని అందించారు. అలాగే పబ్లిసిటీ లేకుండా ఎన్టీఆర్ కొన్ని ట్రస్ట్‌లను నడుపుతారని ఫిలింనగర్‌లో వార్తలు వినిపిస్తుంటాయి.