రిలయన్స్ జియో.. ఫేస్ బుక్ భారీ డీల్…ఉపాధికి ఊతం

ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో, ఫేస్ బుక్ చేతులు కలిపాయి. జియో ప్లాట్ ఫ్యామ్స్ లో 9.99 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఫేస్ బుక్ సమాయత్తమైంది. దీని విలువ 5.7 బిలియన్ డాలర్లు. అంటే.. దాదాపు రూ. 43, 574 కోట్లు..

రిలయన్స్ జియో.. ఫేస్ బుక్ భారీ డీల్...ఉపాధికి ఊతం
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 22, 2020 | 12:55 PM

ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో, ఫేస్ బుక్ చేతులు కలిపాయి. జియో ప్లాట్ ఫ్యామ్స్ లో 9.99 శాతం వాటాను కొనుగోలు చేసేందుకు ఫేస్ బుక్ సమాయత్తమైంది. దీని విలువ 5.7 బిలియన్ డాలర్లు. అంటే.. దాదాపు రూ. 43, 574 కోట్లు.. ఈ మేరకు ఈ రేణు సంస్థలూ వేర్వేరుగా ప్రకటనలు రిలీజ్ చేశాయి. మేజర్ డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ దశలో ఉన్న ఇండియాలో దేశ వ్యాప్తంగా వాణిజ్య సంబంధ అవకాశాలు కల్పించేందుకు సిధ్ధంగా ఉన్నామని ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు, కో-ఫౌండర్ మార్క్ జుకర్ బెర్గ్ ప్రకటించారు. జియో ప్లాట్ ఫామ్స్ లో తాము పెట్టుబడులు పెడుతున్నామని, ఈ ఆర్ధిక ఇన్వెస్ట్ మెంట్లే కాక.. కొన్ని భారీ ప్రాజెక్టులపైనా కలిసి పని చేయబోతున్నామని ఆయన తన ఫేస్ బుక్ పేజ్ లో పేర్కొన్నారు. ఇది భారత దేశ వ్యాప్తంగా ప్రజలకు వాణిజ్య సంబంధ అవకాశాలకు కవాటాలు తెరవబోతోందని ఆయన తెలిపారు. ఫేస్ బుక్, వాట్సాప్ లో ఇండియా అతి పెద్ద ‘సమాజమని’, ఎంతో మంది ప్రతిభావంతులైన ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఆన్ లైన్ లో చిన్న వ్యాపారాలు చేసుకునేవారికి, కోట్లాది భారతీయులకు చేరువగా ఉన్న జియో వంటి సంస్థలు ఈ విషయంలో కీలక పాత్ర వహిస్తున్నాయని జుకర్ బెర్గ్ అన్నారు. అటు ముకేశ్ అంబానీ కూడా తాము, ఫేస్ బుక్ యాజమాన్యం డిజిటల్ ట్రాన్స్ ఫర్మేషన్ ఇండియా కోసం చేతులు కలపడం ముదావహమన్నారు. ఈ టై అప్ వల్ల దేశవ్యాప్తంగా  సుమారు 3 కోట్ల కిరాణా స్టోర్స్ ఏర్పాటవుతాయని, డిజిటల్ టెక్నాలజీలో కొత్తగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు. వాట్సాప్ డిజిటల్ పే మెంట్స్ సర్వీసును ప్రభుత్వం ఆమోదించిన అనంతరం ఈ సంస్థల మధ్య ఈ డీల్ కుదరడం విశేషం. ఇండియాలో వాట్సాప్ కు సుమారు 400 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు.