రాజకీయ విమర్శలపై స్పందించిన ఫేస్‌బుక్

భారతదేశ రాజకీయాలు ఇప్పడు సామాజిక మాధ్యమాలపైకి మారాయి. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపిందని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలపై..

రాజకీయ విమర్శలపై స్పందించిన ఫేస్‌బుక్
Follow us

|

Updated on: Aug 17, 2020 | 11:47 AM

Facebook Responding to Criticism : భారతదేశ రాజకీయాలు ఇప్పడు సామాజిక మాధ్యమాలపైకి మారాయి. సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపిందని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలపై ఫేస్‌బుక్ స్పందించింది. రాజకీయాలు, రాజకీయనేతలతో సంబంధం లేకుండా తమ విధానాలను అమలు చేస్తున్నామని స్పష్టం చేసింది.

ఏ రాజకీయతోకాని ఆ పార్టీ పార్టీ అనుబంధ సంస్థలతో ఎలాంటి సంబంధం లేకుండా హింసను ప్రేరేపించే ద్వేషపూరిత కంటెంట్‌ను తాము నిషేధించామనీ పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఇదే విధానాలను అమలు చేస్తున్నామని ఫేస్‌బుక్ ప్రతినిధి వివరణ ఇచ్చారు. ఇలాంటి అశాలపై ఇంకా చాలా చేయాల్సి ఉందనీ.. తమ కఠిన నిబంధనల అమలులో పురోగతి సాధిస్తున్నామని స్పష్టం చేశారు. ఖచ్చితత్వాన్ని నిర్ధారించేందుకు రెగ్యులర్ ఆడిట్లను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.

కాగా ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ ప్రచురించిన ప్రత్యేక కథనం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మాటల యుద్ధానికి దారి తీసింది. బీజేపీ సోషల్ మీడియాను తనకు అనుకూలంగా మలుచుకుంటోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

ఇండియాలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌, ఫేస్‌బుక్, వాట్సాప్‌లను నియంత్రిస్తున్నాయనడానికి అమెరికా మీడియా కథనం నిదర్శనమని రాహుల్ విమర్శలు గుప్పించారు. ఈ వ్యాఖ్యలకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ సీనియర్ నేత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి నాయకత్వం వహిస్తున్న శశిథరూర్ పౌరుల హక్కులను పరిరక్షించడం, సామాజిక.. ఆన్‌లైన్ న్యూస్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల దుర్వినియోగాన్ని నివారించడం అనే అంశంపై సాక్ష్యాలను పరిశీలిస్తామన్నారు.

సొంతపార్టీ పైనే నియంత్రణ లేనివారు… మొత్తం ప్రపంచాన్నే బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌లు కంట్రోల్ చేస్తున్నాయనే నిందలు వేయడం సహజమే అని కౌంటర్ ఇచ్చారు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్. రాహుల్ గాంధీ ఆరోపణలకుకేంబ్రిడ్జ్ అనలిటికా మరియు ఫేస్‌బుక్‌లతో గోప్యంగా ఉంచాల్సిన డేటాను ఇస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా దొరికింది కాంగ్రెస్ అని ఆ విషయం గురించి రాహుల్ ఎందుకు మాట్లాడరని రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. చేయాల్సిందంతా కాంగ్రెస్ చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్లు బీజేపీకి ఆ పాపాన్ని అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు.

దీనిపై గతంలో ఫేస్‌బుక్ కు నోటీసులిచ్చినట్టు గుర్తు చేశారు. దీంతో వివాదం రేగింది. దీనిపై స్పందించిన కేంద్ర ఐటీ మంత్రి రవి శంకర్ ప్రసాద్ ఈ ఆ రోపణలను తీవ్రంగా ఖండించారు. ఓడిపోయినవారు ఇలాంటి ఆరోపణలు చేయడం సర్వసాధారణమేనని, కేంబ్రిడ్జ్ అనలిటికా, ఫేస్‌బుక్ ఒప్పందంతో రెడ్ హ్యాండెడ్ గా దోరికిపోయింది కాంగ్రెస్ పార్టీయేనంటూ ఎదురు దాడి చేసిన సంగతి తెలిసిందే.

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!