నెటిజ‌న్‌ల‌కు గుడ్‌న్యూస్ః ఇన్‌స్టా నుంచి ఫేస్‌బుక్‌కు డైరెక్ట్‌ మెసేజ్

నెటిజ‌న్‌ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది ఫేస్‌బుక్ సంస్థ‌. ఇక‌పై ఫేస్‌బుక్‌ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌కు డైరెక్ట్ మెసేజ్ చేసేయ‌వ‌చ్చు. అదెలాగ అనుకుంటున్నారా? సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌, మెసెంజ‌ర్ చాట్‌ల‌ను ఒకే యాప్‌లో విలీనం చేసేందుకు..

నెటిజ‌న్‌ల‌కు గుడ్‌న్యూస్ః ఇన్‌స్టా నుంచి ఫేస్‌బుక్‌కు డైరెక్ట్‌ మెసేజ్
Follow us

| Edited By:

Updated on: Aug 16, 2020 | 10:46 PM

నెటిజ‌న్‌ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది ఫేస్‌బుక్ సంస్థ‌. ఇక‌పై ఫేస్‌బుక్‌ నుంచి ఇన్‌స్టాగ్రామ్‌కు డైరెక్ట్ మెసేజ్ చేసేయ‌వ‌చ్చు. అదెలాగ అనుకుంటున్నారా? సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌, మెసెంజ‌ర్ చాట్‌ల‌ను ఒకే యాప్‌లో విలీనం చేసేందుకు త‌న ప్ర‌ణాళిక‌ల‌ను ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగానే కొన్నింటిని విలీనం చేసే దిశ‌గా ప‌ని ప్రారంభించింది. ఇన్‌స్టా యాప్ నుంచి ఫేస్ బుక్ మెసెంజ‌ర్‌కు డైరెక్ట్ మెసేజ్‌ చేసేలా కొత్త ఫీచ‌ర్ తీసుకొచ్చింది. ఇంకో ఇన్‌ట్రెస్టింగ్ విష‌యం ఏంటంటే.. ఇన్‌స్టా అకౌంట్ లేకున్నా ఈ మెసేజ్ చేయ‌వ‌చ్చు.

ప్ర‌స్తుతం ఈ అప్‌డేట్‌ యూఎస్‌లోని ఐఓఎస్‌, ఆండ్రాయిడ్ ఇన్‌స్టా యూజ‌ర్ల‌కు మాత్ర‌మే అందుబాటులోకి వ‌చ్చింది. మ‌రికొన్ని రోజుల్లోనే అన్ని దేశాల్లోనూ ఈ ఫీచ‌ర్‌ని తీసుకురాబోతున్నారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్ యాప్ కుడి-ఎగువ మూల‌లో ఉన్న లోగోను మెసెంజ‌ర్ లోగోగా మార్చారు. ఈ మెసేజ్‌ల‌న్నీ కూడా ఎండ్ టూ ఎండ్ ఎన్‌క్రిప్ట్ అవుతాయ‌ని ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకెన్ ‌బ‌ర్గ్ వెల్ల‌డించారు.

Read More:

ధోనీ పేరుతో జొమాటో అద్భుత‌మైన ఆఫ‌ర్‌

ఏపీఎస్ఆర్టీసీ స‌రికొత్త సేవ‌లు.. బ‌స్సుల్లో వైఎస్సార్ జ‌న‌తా బ‌జార్లు

ఐదు రూపాయ‌ల డాక్ట‌ర్ మృతి.. సీఎం సంతాపం

వెద‌ర్ వార్నింగ్ః తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రెడ్ అలర్ట్