స్తంభించిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్!

Facebook, స్తంభించిన ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్!

మార్నింగ్ లేచిన దగ్గర నుంచి అర్ధరాత్రి పడుకునే వరకు జనాలు ఎక్కువగా ఉపయోగించేది సోషల్ మీడియా. అలాంటి సోషల్ మీడియా యాప్స్ కాసేపు పనిచేయకపోయినా మన డైలీ రొటీన్ ఆగిపోతుంది. సరిగ్గా ఇలాంటి పరిస్థితి ఇవాళ తలెత్తింది. సోషల్ మీడియా దిగ్గజాలైన వాట్సాప్, ఇన్‌స్టాగ్రాంలతో పాటు ఫేస్‌బుక్‌ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారత్‌తో సహా ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో ఫేస్‌బుక్‌తోపాటు వాట్సాప్, ఇన్‌స్టాగ్రాం సేవలు వినియోగదారులకు సరిగ్గా లభించడం లేదు. ముఖ్యంగా ఈ సమస్య ఈశాన్య అమెరికా, యూకే, ఐరోపాలోని కొన్ని ప్రాంతాల్లో ఉత్పన్నమైందని తెలుస్తోంది. దీనితో చాలామంది యూజర్లు వాటికీ గుడ్ బై చెప్పినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

నివేదికల ప్రకారం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సమస్యలు బుధవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఆయా సైట్లు ఓపెన్ అవుతున్నప్పటికీ వాటిలోని ఇమేజ్‌స్, వీడియోలు ఓపెన్ కావడం లేదని యూజర్లు ఫిర్యాదు చేస్తున్నారు. అయితే ఈ విషయంపై ఫేస్‌బుక్ సంస్థ ఇప్పటివరకు అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. కాగా యూజర్లు.. “ఇన్‌స్టాగ్రామ్ డౌన్”, “ఫేస్‌బుక్ డౌన్” వంటి హ్యాష్‌ట్యాగ్‌లతో తమకు ఎదురవుతోన్న ఇబ్బందులను ట్విట్టర్‌లో పంచుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *