ఫేస్‌బుక్, ఇన్‌స్టా సేవలకు అంతరాయం!

Facebook Instagram, ఫేస్‌బుక్, ఇన్‌స్టా సేవలకు అంతరాయం!

ప్రముఖ సోషల్ మీడియా మాధ్యమాలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలకు ప్రపంచవ్యాప్తంగా కొన్నిచోట్ల అంతరాయం ఏర్పడింది. ఈ సమస్య ఆదివారం ఉదయం 6.30 నుంచి తలెత్తినట్లు తెలుస్తోంది. ఇన్‌స్టా యూజర్లు తమ ఖాతాల్లోకి లాగ్ ఇన్ అవ్వలేకపోతున్నామని చెబుతుంటే.. ఫేస్‌బుక్ వినియోగదారులైతే స్టేటస్ అప్‌డేట్స్, వీడియోస్, ఫొటోస్ పోస్ట్ కావట్లేదని ఫిర్యాదు చేస్తున్నారు. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఆసియాలోని కొన్ని ప్రదేశాల్లో ఫేస్‌బుక్, ఇన్‌స్టా సేవలకు అంతరాయం కలిగినట్లు తెలుస్తోంది. అయితే అసలు సమస్య ఏంటనేది తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *