కేరళ కుర్రోడా ! నీకిదే ఫేస్ బుక్ వందనం !

కేరళలో అళపుజకు చెందిన 19 ఏళ్ళ విద్యార్థి కె.ఎస్.అనంతకృష్ణకు ఫేస్ బుక్ ధన్యవాదాలు తెలిపింది. వాట్సాప్ లో యూజర్ కి తెలియకుండానే అతని ఫైళ్లను, సమాచారాన్ని ఇతరులు పూర్తిగా తొలగించే ఓ బగ్ ను ఈ కుర్రాడు కనుగొన్నాడు. బీటెక్ స్టూడెంట్ అయిన అనంతకృష్ణ .. ఈ బగ్ గురించి ఫేస్ బుక్ కి తెలియజేసి.. దీనికి పరిష్కార మార్గాన్ని కూడా వివరించాడట. దీనిపై రెండు నెలల పాటు నిశితంగా అధ్యయనం చేసిన ఫేస్ బుక్ ఇతని […]

కేరళ కుర్రోడా ! నీకిదే ఫేస్ బుక్ వందనం !
Follow us

|

Updated on: Jun 04, 2019 | 5:09 PM

కేరళలో అళపుజకు చెందిన 19 ఏళ్ళ విద్యార్థి కె.ఎస్.అనంతకృష్ణకు ఫేస్ బుక్ ధన్యవాదాలు తెలిపింది. వాట్సాప్ లో యూజర్ కి తెలియకుండానే అతని ఫైళ్లను, సమాచారాన్ని ఇతరులు పూర్తిగా తొలగించే ఓ బగ్ ను ఈ కుర్రాడు కనుగొన్నాడు. బీటెక్ స్టూడెంట్ అయిన అనంతకృష్ణ .. ఈ బగ్ గురించి ఫేస్ బుక్ కి తెలియజేసి.. దీనికి పరిష్కార మార్గాన్ని కూడా వివరించాడట. దీనిపై రెండు నెలల పాటు నిశితంగా అధ్యయనం చేసిన ఫేస్ బుక్ ఇతని తెలివికి ఆశ్చర్యపోయి.. అతడ్ని సత్కరించాలని నిర్ణయించింది. అనంతకృష్ణకు 34 వేల నగదు బహుమతితో బాటు ప్రతిష్టాత్మక ‘ హాల్ ఆఫ్ ఫేమ్ ‘ లో ఇతనికి చోటు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఈ ఏడాది ఫేస్ బుక్ థ్యాంక్స్ లిస్టులోని 80 వ స్పాట్ లో అనంతకృష్ణ పేరు చోటు చేసుకుంది. ఇందుకు అనంతకృష్ణ కూడా ఫేస్ బుక్ కి కృతజ్ఞతలు తెలియజేశాడు. కేరళలోని సైబర్ సెల్ లో కూడా ఈ విద్యార్థి తన వంతు సేవలందిస్తున్నాడు.