Breaking News
  • ఢిల్లీ భారత్ లో విజృంభిస్తున్న కరోనా వైరస్. 2 లక్ష 16 వేల మార్క్ ని దాటినా కరోనా పాజిటివ్ కేస్ లు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు : 216919. దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు: 106737. కరోనా నుంచి డిశ్చార్జ్ అయిన బాధితులు: 104106. దేశం మొత్తం కరోనా తో మృతుల సంఖ్య : 6075. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.
  • జిహెచ్‌ఎంసి స్టాండింగ్ క‌మిటీ ఎన్నిక‌ల‌కు షెడ్యూల్ విడుదల చేసిన కమిషనర్ లోకేష్ కుమార్ . కొత్త స్టాండింగ్ క‌మిటీ ఎంపిక‌కు రేపు ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ . ఈ నెల 10 నుండి 18 వ‌ర‌కు నామినేష‌న్ల స్వీక‌ర‌ణ .
  • ఇంటర్ బోర్డ్ , ఎగ్జామినర్ ల మధ్య బస్ ఛార్జ్ ల లొల్లి. పేపర్ వాల్యుయేషన్ కి వచ్చే వారి కోసం ఆర్టీసీ బస్ లు ఏర్పాటు చేసిన ఇంటర్ బోర్డ్ . ఎగ్జామినర్ ల నుండి ఆ టైం లో ఛార్జ్ లు వసూలు చేయని ఆర్టీసీ. ఇంటర్ బోర్డ్ ఆర్టీసీ కి రాసిన లేఖతో టికెట్ ఛార్జ్ లు తీసుకొని ఆర్టీసీ . ఇప్పుడు ఛార్జ్ లు కట్టాలని అంటున్న ఇంటర్ బోర్డ్ .
  • పదో తరగతి పరీక్షల ఏర్పాట్లపై హైకోర్టుకు నివేదికలో విద్యా శాఖ. పదో తరగతి పరీక్ష కేంద్రాలను 2530 నుంచి 4535కి పెంచాం. పదో తరగతి విద్యార్థులకు కొత్తగా హాల్ టికెట్లు ఇవ్వడం లేదు. పరీక్ష కేంద్రాల వివరాలను విద్యార్థులకు సమాచారం ఇచ్చాం. థర్మల్ స్క్రీనింగ్ కిట్లు, మాస్కులు, గ్లవుజులు సేకరించి కేంద్రాలకు పంపించాం. కేంద్రానికి ఒకరు చొప్పున 4,535 మంది వైద్య సిబ్బంది. డీఈఓ కార్యాలయాల్లో హెల్ప్ లైన్ ఏర్పాటు.
  • తెలుగు ఐఏఎస్ అధికారికి కీలక బాధ్యతలు అమెరికాలోని భారత ప్రత్యేక ఆర్థిక దౌత్యవేత్తగా రవి కోట నియామకం ప్రధాని అధ్యక్షతన కేబినెట్ నియామకాల కమిటీ నిర్ణయం వాషిగ్టంట్ (డీసీ)లోని రాయబార కార్యాలయంలో విధులు మూడేళ్లపాటు పదవిలో కొనసాగనున్న రవి కోట.
  • తిరుమల: శ్రీవారి దర్శనాలపై టీటీడీ ఈఓ కామెంట్స్. 8వ తేది నుండి భక్తులకు దర్శనాలు కల్పించడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నాం. రేపు మరోసారి సమావేశం నిర్వహించి దర్శన విధానాలను ప్రకటిస్తాం. భక్తుల సంఖ్య, గదుల కేటాయింపు, రవాణా, ప్రసాదాల విక్రయం, టైంస్లాట్ టికెట్ల విధానం, థర్మల్ స్క్రీనింగ్, అన్న ప్రసాద భవనం ప్రారంభం వంటి అంశాలపై అంచనాకు వచ్చాం. దర్శన విధి విధానాలను నిర్ణయించి 8వ తేది నుండి దర్శనాలు ప్రారంభిస్తాం. టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్.
  • తాడేపల్లి : తాడేపల్లి లో గల ఉండవల్లి సెంటర్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నివాసానికి అతి చేరువలో గల ఎన్టీఆర్ కట్ట మరియు క్రిస్టియన్ పేట లో ఈరోజు 4 కరోనా పాజిటివ్ కేసులు వెలుగుచూడటంతో అప్రమత్తమైన అధికారులు. కాగా ఇందులో ఇద్దరు వాలంటీర్లు ఉండటంతో ప్రజలను మరింత భయభ్రాంతులకు గురి చేస్తుంది. వాలంటీర్లు ఇద్దరు గత మూడు రోజుల క్రితం తాడేపల్లి లో గల ప్రాంతాలలో పింఛన్లు పంపిణీ చేసినట్లు సమాచారం. అధికారులు తాడేపల్లి ప్రాంతం మొత్తం తమ ఆధీనంలోకి తీసుకొని అన్ని రకాల శానిటేషన్ పనులను చేస్తున్నారు.

కొత్త సెన్సార్ షిప్ రూల్స్.. మా తడాఖా చూపుతాం.. పాక్ పై సోషల్ మీడియా ఫైర్

పాకిస్తాన్ లో తమ సర్వీసులను నిలిపివేస్తామని గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్ హెచ్చరించాయి. పాక్ లోని ఇమ్రాన్ ప్రభుత్వం వీటిపై గతనెలలో కొత్తగా సెన్సార్ షిప్ నిబంధనలు విధించడం
Social Media, కొత్త సెన్సార్ షిప్ రూల్స్.. మా తడాఖా చూపుతాం.. పాక్ పై సోషల్ మీడియా ఫైర్

పాకిస్తాన్ లో తమ సర్వీసులను నిలిపివేస్తామని గూగుల్, ఫేస్ బుక్, ట్విట్టర్ హెచ్చరించాయి. పాక్ లోని ఇమ్రాన్ ప్రభుత్వం వీటిపై గతనెలలో కొత్తగా సెన్సార్ షిప్ నిబంధనలు విధించడంతో ఇవి భగ్గుమన్నాయి. ఆన్ లైన్ ద్వారా (ఈ విధమైన సాధనాల ద్వారా) కలుగుతున్న హాని నుంచి ప్రజలను రక్షించేందుకు.. సోషల్ మీడియా యాక్టివిటీని నియంత్రిస్తూ.. ప్రభుత్వం కొత్త నిబంధనలను రూపొందించింది. అవసరమైనప్పుడు.. తమకు సంబంధిత సమాచారం ఎక్కడి నుంచి అందిందో, ఆ డేటాను తప్పనిసరిగా ఇవి  ఓ ఇన్వెస్టిగేషన్ ఏజన్సీకి షేర్ చేయాలని సర్కార్ సూచించింది. ఇందుకు మూడు నెలల సమయం కూడా ఇచ్చింది. కాగా-ఈ రూల్స్ పట్ల ఫేస్ బుక్, ట్విటర్, గూగుల్, అమెజాన్, యాపిల్ ఇతర ఇంటర్నెట్ జెయింట్లతో కూడిన ‘ఆసియా ఇంటర్నెట్ కలెక్టివ్’ తమ నిరసనను ఓ లేఖ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ.. ఈ నిబంధనలు మార్చాలని కోరింది. ఇవి నిరంకుశమైనవిగా ఉన్నాయని, మా ప్రయోజనాలకు విరుధ్ధమని పేర్కొన్నాయి. అసలు ఈ రూల్స్ ని రూపొందించే ముందు స్టేక్ హోల్డర్లను ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ఈ సంస్థ ప్రశ్నించింది. పార్లమెంటులో ఎలాంటి చర్చ జరపకుండానే వీటిని ఆమోదిస్తారా అని కూడా ఈ సోషల్ సాధనాలు సందేహం వ్యక్తం చేశాయి. పాకిస్తాన్ లో సోషల్ మీడియా పట్ల ఈ విధమైన నిబంధనలు విధిస్తే.. అంతర్జాతీయ కంపెనీలు తమ పనితీరుపై అనుమానాలు ప్రకటించవచ్చు అని కూడా పేర్కొన్నాయి.

అయితే ఈ రూల్స్ కి సంబంధించి విధివిధానాలు ఇంకా ఖరారు కాలేదని, వీటి మార్పునకు సంబంధించి సమావేశాలు జరుగుతున్నాయని పాక్ విద్యా  శాఖ మంత్రి షఫ్ ఖాత్ మహమ్మద్ తెలిపారు.

 

 

Related Tags