ఫేస్‌బుక్ పోరంబోకు

ప్రస్తుతం ప్రపంచమంతా ఫేస్ బుక్ మానియా నడుస్తోందని కొత్తగా చెప్పక్కర్లేదు. ఈ ఫేస్ బుక్ ఫ్రెండ్స్ మాయలో పడి సర్వం పోగొట్టుకుని లబోదిబోమన్న బాధితుల ఉదంతాలూ తక్కువేంకాదు. అయితే, తాజాగా ఫేస్ బుక్ తో పోరంబోకు పనికి పాల్పడ్డాడో సివిల్ ఇంజనీర్. చదివింది ఉన్నత చదువే అయినా వీడి బుద్ది మాత్రం చాలా నీచంగా ఉంది. ఫేస్ బుక్ లో అందమైన అమ్మాయిలకు ఫ్రెండ్స్ రిక్వెస్ట్ పంపడం.. వాళ్లు ఓకే చేస్తే వాళ్ల ఫొటోలు తీసుకుని వాళ్ల పేరిటే ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి అసభ్యకర పోస్టింగులు చేయడం వీడి రొటీన్ లైఫ్.

ఇతడి పేరు సేనాపతి హిమతేజ. అనంతపురం జిల్లా మడకశిరకు చెందిన ఈ ఉన్మాది పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన అమ్మాయితో ఇలాంటి పైశాచిక చర్యకు పాల్పడ్డాడు. దీంతో సదరు బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో వీడి బాగోతం బట్టబయలైంది. ఇలాంటి వాళ్ల పట్ల అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. తెలియని వాళ్లతో పరిచయాలు, ఫొటోస్ షేర్ చేసుకోవడాలూ వద్దంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *