‘ఫొని’ బాధితుల కోసం మేము సైతం – ఫేస్‌బుక్

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ‘ఫొని’ తుఫాన్ బాధితుల కోసం వినూత్న రీతిలో సేవలు అందిస్తోంది. ముఖ్యంగా తుఫాన్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇతర సన్నిహితులకు తమ క్షేమ సమాచారాన్ని అందించడం కోసం ‘ఐ యామ్ సేఫ్’ అనే ఆప్షన్‌ను ఫేస్‌బుక్ యాక్టివేట్ చేసింది. కాగా ఈ ఆప్షన్‌ను భారత్‌లోని ఫేస్‌బుక్ పేజ్ వ్యూయర్లకు కల్పించారు. ముఖ్యంగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు చెందిన వారికి వీలుగా ఈ ఆప్షన్‌ను డిజైన్ చేయడం […]

'ఫొని' బాధితుల కోసం మేము సైతం - ఫేస్‌బుక్
Follow us

|

Updated on: May 03, 2019 | 5:05 PM

సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ ‘ఫొని’ తుఫాన్ బాధితుల కోసం వినూత్న రీతిలో సేవలు అందిస్తోంది. ముఖ్యంగా తుఫాన్ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు, ఇతర సన్నిహితులకు తమ క్షేమ సమాచారాన్ని అందించడం కోసం ‘ఐ యామ్ సేఫ్’ అనే ఆప్షన్‌ను ఫేస్‌బుక్ యాక్టివేట్ చేసింది. కాగా ఈ ఆప్షన్‌ను భారత్‌లోని ఫేస్‌బుక్ పేజ్ వ్యూయర్లకు కల్పించారు. ముఖ్యంగా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు చెందిన వారికి వీలుగా ఈ ఆప్షన్‌ను డిజైన్ చేయడం విశేషం.  మీరు సురక్షితంగా ఉన్నట్లయితే ఐ యామ్ సేఫ్ అనే ఆప్షన్‌ను క్లిక్ చేస్తే చాలు.. ఈ విషయం మీ సన్నిహితులు ఫేస్‌బుక్ ద్వారా తెలుసుకునే వీలుంటుంది.   . .

ఇదిలా ఉండగా ఫొని తుఫాన్ ఒడిశా తీరాన్ని దాటింది. తీర ప్రాంతాల్లో భారీగా ఆస్తినష్టం సంభవించింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఫొని తుఫాన్  తీరం దాటే సమయంలో 150-175 కేఎంపీహెచ్ వేగంతో ఉధృతమైన గాలులు వీచినట్లు తెలిపారు. ఇప్పటికే తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ఇదిలా ఉంటే ఒడిశాలో దాదాపు 10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు స్పెషల్ రిలీఫ్ కమిషనర్ ఆఫీస్ ఒక ప్రకటనలో తెలిపింది.