ఆ యాప్ వాడారో.. ’ఫేస్‘ టర్నింగ్ ఇచ్చుకోవాల్సిందే..!

ఏజ్ ఫిల్టర్‌ అంటూ ఓవర్ నైట్‌లో వైరల్‌ అయిపోయిన రష్యన్‌కు చెందిన ఫొటో ఎడిటింగ్ యాప్ ‘ఫేస్ యాప్’ భారత్‌లో సాంకేతిక సమస్యను ఎదుర్కొంటుంది. ఈ యాప్‌ను వాడుతున్న పలువురు యూజర్లు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. యాప్స్ డౌన్‌లోడర్లైన గూగుల్ ప్లే, యాపిల్స్ యాప్ స్టోర్‌లో ఫేస్ యాప్ ప్రస్తుతం దొరుకుతున్నప్పటికీ.. వాడుతున్నప్పుడు మాత్రం సమస్య వస్తోంది. దీనిపై పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆ సంస్థను ప్రశ్నలతో ముంచెత్తుతున్నారు. ఈ యాప్‌ను వాడుతున్న ఆండ్రాయిడ్ యూజర్లకు […]

ఆ యాప్ వాడారో.. ’ఫేస్‘ టర్నింగ్ ఇచ్చుకోవాల్సిందే..!
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Jul 18, 2019 | 4:07 PM

ఏజ్ ఫిల్టర్‌ అంటూ ఓవర్ నైట్‌లో వైరల్‌ అయిపోయిన రష్యన్‌కు చెందిన ఫొటో ఎడిటింగ్ యాప్ ‘ఫేస్ యాప్’ భారత్‌లో సాంకేతిక సమస్యను ఎదుర్కొంటుంది. ఈ యాప్‌ను వాడుతున్న పలువురు యూజర్లు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. యాప్స్ డౌన్‌లోడర్లైన గూగుల్ ప్లే, యాపిల్స్ యాప్ స్టోర్‌లో ఫేస్ యాప్ ప్రస్తుతం దొరుకుతున్నప్పటికీ.. వాడుతున్నప్పుడు మాత్రం సమస్య వస్తోంది. దీనిపై పలువురు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఆ సంస్థను ప్రశ్నలతో ముంచెత్తుతున్నారు. ఈ యాప్‌ను వాడుతున్న ఆండ్రాయిడ్ యూజర్లకు ‘‘సంథింగ్ వెంట్ రాంగ్, ప్లీజ్ ట్రై అగైన్’’ అని చూపిస్తుండగా.. ఐఓఎస్ యూజర్లకు ‘‘ApiRequestedError error 6- Operation couldn’t be completed’’ అని చూపించింది. అయితే ఈ ఉదయం నుంచి యాప్ మళ్లీ పనిచేయడం ప్రారంభించింది. కాగా కొన్ని గంటల పాటు ఈ యాప్ భారత్‌లో ఎందుకు పనిచేయడం లేదన్న దానిపై ఇంకా సంస్థ స్పందించలేదు.

ఫేస్‌యాప్‌ ద్వారా మన ముఖాలను వృద్ధులుగా లేదా యవ్వనంగా.. ఎలా కావాలనుకుంటే అలా మార్చుకునేందుకు వీలుగా ఉంటుంది. అలాగే ఇందులో ఒక రెగ్యులర్ ఫొటోకు స్మైల్‌ను కూడా పెట్టుకునే వీలుంటుంది. దీంతో ఈ యాప్ ఇటీవల ఇండియాలో బాగా పాపులర్ అయ్యింది. ఎంతలా అంటే వారి ఫొటోలతో మొదలుకొని సెలబ్రిటీల ఫొటోలను కూడా ఈ యాప్‌తో మార్చి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ చేశారు. కాగా ప్రస్తుతం ఈ యాప్ యాపిల్ ప్లే స్టోర్‌లో ఒకటవ స్థానంలో ట్రెండ్ అవుతుండగా.. గూగుల్ ప్లే స్టోర్‌లో మూడో స్థానంలో ఉంది.

అయితే ఈ యాప్‌ను వాడే ముందు జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. అదెలా అంటే ఫేస్‌యాప్ వాడే ప్రతి వ్యక్తి ఆ యాప్ టర్మ్స్ అండ్ కండీషన్స్‌కు ఓకే చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ నిబంధనల్లోనే ఓ పెద్ద మెలిక ఉంది. అదేంటంటే యూజర్లు యాప్‌లో స్టోర్ చేసే తమ సమాచారంతో పాటు ప్రొసెసింగ్ కోసం సర్వర్లలోకి అప్‌లోడ్ చేసే ఫొటోలు ఇతర డేటాను ఫేస్ యాప్ ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. ఉదాహరణకు ఇండియాలో యాప్ ఉపయోగించిన వ్యక్తుల ఫొటోలు, డేటాను ఈ యాప్ వేరే దేశాల్లో తమకు కావాల్సినట్లు ఉపయోగించుకోవచ్చు. లేదా ఆ సమాచారాన్ని ఇతరులకు అమ్ముకోవచ్చు. అయితే మనం టర్మ్స్ అండ్ కండీషన్స్‌కు ఓకే చెప్పినందు వల్ల ఆ కంపెనీపై ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉండదు. ఇక ఈ డేటాను ఉపయోగించి ఫేస్ యాప్ ఫేక్ రికగ్నిషన్ స్మార్ట్ ఫోన్ అన్ లాకింగ్‌, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా ఫొటోలను మార్ఫింగ్ చేయడం తదితర చర్యలకు పాల్పడే అవకాశముంది. ఈ విషయం యూజర్లకు తెలీడం లేదు. అందుకే యూజర్లు ఫేస్ యాప్ వాడే ముందు ఆలోచించుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
లులు మాల్‌లో ఐస్‌ క్రీం కొన్న కస్టమర్‌..కదులుతున్న వాటిని చూసి..
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు