Breaking News
  • శ్రీకాకుళం: కచరాంలో తృప్తి రిసార్ట్‌ యాజమాన్యం నిర్వాకం. రోడ్లపై గుర్రపు స్వారీ నిర్వహించిన తృప్తి రిసార్ట్‌ యాజమాన్యం. బైక్‌పై వెళ్తున్న రాంబాబు, రమాదేవి దంపతులను గుద్దిన గుర్రం. ఆస్పత్రిలో రాంబాబు పరిస్థితి విషమం. పట్టించుకోని రిసార్ట్‌ యాజమాన్యం. రాసార్ట్‌ ఎదుట స్థానికుల ఆందోళన, పరిస్థితి ఉద్రిక్తం. భారీగా మోహరించిన పోలీసులు.
  • ప.గో: తణుకు మండలం దువ్వలో పిచ్చికుక్క స్వైర విహారం. పిచ్చికుక్క దాడిలో10 మందికి గాయాలు.
  • గుంటూరు: సత్తెనపల్లిలో మహిళ ఆత్మహత్యాయత్నం. చోరీ కేసు పెట్టారన్న మనస్థాపంతో నిద్రమాత్రలు మింగిన లక్ష్మీ. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • అనంతపురం: కదిరి మండలం నడిమిపల్లిలో దారుణం. యువకుడు సుధాకర్‌ గొంతు కోసిన దుండగులు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుధాకర్‌. గతంలో రామాంజనేయులు భార్యను ఎత్తుకెళ్లి.. తిరిగి అప్పగించిన సుధాకర్‌. రామాంజనేయులుపై అనుమానం వ్యక్తం చేస్తున్న పోలీసులు.
  • అనంతపురం: హిందూపురంలో రెచ్చిపోయిన వీధికుక్కలు. ఇద్దరు చిన్నారులపై దాడి. వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ చిన్నారులు. ఆస్పత్రికి తరలింపు, పరిస్థితి విషమం.
  • విజయవాడ: వంశీ వ్యాఖ్యలపై అయ్యప్ప భక్త కమిటీ అభ్యంతరం. టీవీ9 డిబేట్‌లో వంశీ అనుచిత వ్యాఖ్యలు సరికాదు. అయ్యప్ప మాలలో ఉన్న భక్తులు రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. పరుష పదజాలంతో భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. అయ్యప్ప భక్తులకు వంశీ కళంకం తెచ్చారు. ఇప్పటికైనా నియమనిష్టలతో దీక్ష చేయాలి-వేణుగోపాలస్వామి.
  • హైదరాబాద్‌: అశ్వత్థామరెడ్డి నివాసానికి వెళ్లిన ఎంపీ కోమటిరెడ్డి. అశ్వత్థామరెడ్డిని పరామర్శించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా అందరూ ముందుకు రావాలి. అశ్వత్థామరెడ్డికి ఏం జరిగినా సీఎం కేసీఆర్‌దే బాధ్యత. కార్మికుల సమస్యలు ప్రభుత్వం త్వరగా పరిష్కరించాలి. సడక్‌బంద్‌ను విజయవంతం చేయాలి-ఎంపీ కోమటిరెడ్డి.

‘బ్రెగ్జిట్ డీల్’ పై ఇంకా అయోమయం.. బోరిస్ జాన్సన్ ‘బిక్క మొహం’ ! జనరల్ ఎన్నికలు తప్పవా?

బ్రిటన్ లో బ్రెగ్జిట్ డీల్ పై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. అసలు ఈ వ్యవహారం ఎప్పుడు ఓ కొలిక్కి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. మంగళవారం ఈ డీల్ పై బ్రిటన్ పార్లమెంటులో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈయూ (యూరోపియన్ యూనియన్) నుంచి బ్రిటన్ వైదొలగాలన్న ప్రధాని బోరిస్ జాన్సన్ కు మద్దతుగా సభ్యులు సూత్రప్రాయంగా మద్దతు తెలిపారు. అయితే ఆ తరువాత కొంతసేపటికే ఇందుకు అవసరమైన చట్టం ఆమోదానికి ఆయన రూపొందించిన ‘ ఫాస్ట్ ట్రాక్ టైం టేబుల్ ‘ ని వారు తిరస్కరించారు. ఒకవిధంగా చెప్పాలంటే.. ‘ ఎస్ ‘.. లేదా ‘ నో ‘ అనే పరిస్థితి ఏర్పడింది. ఇది చివరకు ఎలా దారి తీస్తుందంటే.. ఈయూ నుంచి తమ దేశం ఎలాగైనా వైదొలగేలా చూస్తానని, ‘ చావో ‘, ‘ రేవో ‘ తేల్చుకుంటానని బోరిస్ చేసిన ప్రామిస్ నెరవేరేలా లేదనే అంటున్నారు. అసలు బ్రెగ్జిట్ పోల్ ని కొన్ని రోజులపాటో, లేదా కొన్ని వారాల పాటో, అదీగాకుండా కొన్ని నెలల పాటో వాయిదా వేస్తారా అన్నది కూడా తెలియడంలేదు.

మంగళవారం సాయంత్రం హౌస్ ఆఫ్ కామన్స్ లో నాటకీయ పరిణామాలు సంభవించాయి. బోరిస్ జాన్సన్ చేసిన నూతన ప్రతిపాదనను తాము సమర్థిస్తున్నామని ఎంపీలు స్పష్టం చేశారు. దీనికి అనుకూలంగా 329, ప్రతికూలంగా 299 ఓట్లు వచ్చాయి. ఇది ఒక విధంగా బోరిస్ కు విజయమే.. మొట్టమొదటిసారిగా ఓ బ్రిటన్ ప్రధాని రూపొందించిన ‘ విత్ డ్రాల్ ప్లాన్ ‘ పార్లమెంటరీ ఆమోదానికి నోచుకుంది.
కాగా-నాణేనికి మరో వైపులా.. 110 పేజీలతో రూపొందించిన చట్ట ప్రతులను చదివేందుకు, స్క్రూటినీ చేసేందుకు లేదా సవరించేందుకు
ఎంపీలు కేవలం మూడు రోజుల సమయం (72 గంటలు) మాత్రమే తీసుకోవాలన్న బోరిస్ డిమాండుకు సభ ‘ నో ‘ చెప్పింది. ఈ డిమాండును తొసిపుచ్ఛుతూ 322 మంది, సమర్థిస్తూ 308 మంది ఓటు చేశారు. ఈ ఓటింగ్ అనంతరం బోరిస్.. ‘ మనం ఇంకా అనిశ్చితిని ఎదుర్కొనాల్సిందే ‘ అని వ్యాఖ్యానించారు.
అక్టోబరు మాసాంతానికల్లా అసలు డీల్ అన్నది లేకుండానే ఈయూ నుంచి తప్పుకునేందుకు తమ ప్రభుత్వం వెంటనే సన్నాహక చర్యలను చేపడుతుందని బోరిస్ ఆ మధ్య హెచ్ఛరించారు. కానీ అది వట్టి ‘ బ్లఫ్ ‘ గానే మిగిలిపోయింది. తన టైం టేబుల్ ని సభ తిరస్కరించిందంటే మళ్ళీ మనం జనరల్ ఎన్నికలకు వెళ్లాల్సిందే అని ఆయన అసహనంగా పేర్కొన్నారు. ‘ లెటజ్ గో టు ది పోల్స్ ‘
అన్నారు. అటు-తమ దేశానికి మరింత సమయం ఇవ్వాల్సిందిగా ఈయూను కోరుదామని, ఇది జనవరి 31 నాటికి కూడా కావచ్చునని కీలక సభ్యుడు డోనాల్డ్ టస్క్ అన్నారు. పార్లమెంటు చేస్తున్నజాప్యాన్ని బ్రస్సెల్స్ అంగీకరించిన పక్షంలో.. ఇక దేశంలో తిరిగి సార్వత్రిక ఎన్నికలు తప్పకపోవచ్చు. ఏమైనా ఇప్పుడు యూరోపియన్ యూనియనే నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.