ఫేస్‌మాస్క్‌ ధరించకుంటే రూ.10వేలు జరిమానా..!

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కోటికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. లక్షల్లో మరణాలు నమోదయ్యాయి. ఇక కరోనా కట్టడి కోసం పలు దేశాలు కఠిన..

ఫేస్‌మాస్క్‌ ధరించకుంటే రూ.10వేలు జరిమానా..!
Follow us

| Edited By:

Updated on: Jul 15, 2020 | 6:07 AM

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కోటికి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. లక్షల్లో మరణాలు నమోదయ్యాయి. ఇక కరోనా కట్టడి కోసం పలు దేశాలు కఠిన నిర్ణయాలకు ఉపక్రమిస్తున్నాయి. ఈ క్రమంలో యూకే కూడా పలు కఠిన నిబంధనలను తీసుకొస్తోంది. ఈ జూలై 24వ తేదీ నుంచి బహిరంగ ప్రదేశాలతో పాటు.. షాప్స్‌లో మాస్కులను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. ఎవరైనా మాస్క్ ధరించకపోతే వారికి వంద పౌండ్ల పెనాల్టీని విధించనున్నట్లు యూకే సర్కార్ ప్రకటించింది. అంటే మన భారత కరెన్సీ ప్రకారం.. దాదాపు రూ.10 వేల రూపాయలు పెనాల్టీని విధించనున్నారు. ఇంగ్లాడ్‌ మొత్తం ఈ నిబంధనలు అమలులో ఉంటాయని ప్రభుత్వం సోమవారం నాడే ప్రకటించింది. అయితే ఈ జరిమానా విధించే అధికారాన్ని పోలీసులకు అప్పచెప్పింది. కాగా, యూకేలో ఇప్పటి వరకు 2.91 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. కరోన బారినపడి దాదాపు 45 వేల మందికి పైగా మరణించారు.

ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
కాలేజీ స్టూడెంట్‏ను చూసి తొలిచూపులోనే ప్రేమ, పెళ్లి..
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
వంటల్లో ఉపయోగించే బేకింగ్ సోడాతో ఎన్ని ఉపయోగాలున్నాయో తెలుసా?
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
అందుకే రేవంత్‌ నాపై కక్ష పెంచుకున్నారు.. కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
మీరు వింటున్న రూమర్స్ అన్ని నిజమే..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..
26 రోజులుగా మెగాస్టార్ అదే పని మీద ఉన్నారా.? ఇంటర్వెల్ బాంగ్..