గూగుల్ ఉందిగా..డెలివరీ డ్రోన్లు వస్తున్నాయ్

గూగుల్ అనే సెర్చింజన్ లేకపోతే..ప్రస్తుత జనరేషన్ ఎలా ఉండేదో ఊహించుకోవడానికే భయం వేస్తుంది. మానవుల దైనందిన జీవితంలో గూగుల్ ఎప్పుడో భాగమైపోయింది. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏ అవసరాలు తీరాలన్నా..ఛలో గూగుల్ అనేస్తున్నాడు సగటు పౌరుడు. వివిధ రంగాల్లో తన సేవలు విస్తరిస్తూ వస్తున్న గూగుల్ మరో సంచలనానికి సిద్దమైంది.  గాలిలో ఎగురుకుంటూ వచ్చే డ్రోన్ల ద్వారా కస్టమర్లకు వస్తువుల డెలివరీ పద్దతికి  శ్రీకారం చుట్టనుంది. ప్రస్తుతానికి ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో మనం ఏదైనా ఆర్డర్ చేస్తే కొరియర్ […]

గూగుల్ ఉందిగా..డెలివరీ డ్రోన్లు వస్తున్నాయ్
Follow us

|

Updated on: Apr 24, 2019 | 5:36 PM

గూగుల్ అనే సెర్చింజన్ లేకపోతే..ప్రస్తుత జనరేషన్ ఎలా ఉండేదో ఊహించుకోవడానికే భయం వేస్తుంది. మానవుల దైనందిన జీవితంలో గూగుల్ ఎప్పుడో భాగమైపోయింది. ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏ అవసరాలు తీరాలన్నా..ఛలో గూగుల్ అనేస్తున్నాడు సగటు పౌరుడు. వివిధ రంగాల్లో తన సేవలు విస్తరిస్తూ వస్తున్న గూగుల్ మరో సంచలనానికి సిద్దమైంది.  గాలిలో ఎగురుకుంటూ వచ్చే డ్రోన్ల ద్వారా కస్టమర్లకు వస్తువుల డెలివరీ పద్దతికి  శ్రీకారం చుట్టనుంది.

ప్రస్తుతానికి ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లో మనం ఏదైనా ఆర్డర్ చేస్తే కొరియర్ బాయ్ వచ్చి డెలివరీ చేస్తున్నాడు. త్వరలో వారి స్థానంలో గూగుల్ డ్రోన్లు రంగంలోకి దిగి వస్తువులను వినియోగదారులకు డెలివరీ చేయనున్నాయి. గగనతలంలో ఎగురుతూ వెళ్లి  కస్టమర్ల ఇంటి ముందు పార్శిళ్లను నేరుగా దించేందుకు గూగుల్‌కు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్‌ఏఏ) సోమవారం అనుమతులు మంజూరు చేసింది. దీని ద్వారా ఎయిర్‌లైన్ అనుమతులు పొందిన తొలి డ్రోన్‌ ఆపరేటర్‌గా గూగుల్ రికార్డు సృష్టించింది. డ్రోన్ నిబంధనల ప్రకారం అమెరికాలో రద్దీ ప్రాంతాలు, నగరాలు, పట్టణాల్లో డ్రోన్లు ఎగరేయడం ఇప్పటి వరకు నిషిద్ధం.

తొలుత చిన్న చిన్న పార్శిళ్లను గమ్యం చేర్చేలా గూగుల్ ప్లాన్ చేస్తోంది. ఆ తర్వాత సర్వీసులను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా ప్రణాళికలు చేస్తుంది. రెండు, మూడు నెలల్లో తొలి పార్శిల్ డెలివరీ చేసేందుకు గూగుల్ ప్రాసెస్ స్టార్ట్ చేసింది. అయితే, ప్రస్తుతానికి గూగుల్ డ్రోన్ సేవలకు యూఎస్‌లోని వర్జీనియాలోనే అనుమతి ఉండగా, దేశం మొత్తం తమ డ్రోన్లను వినియోగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఎఫ్ఏఏను కోరినట్లు పేర్కొంది. ఈ ప్రాజెక్టుకు గూగుల్ ‘ప్రాజెక్టు వింగ్’ అని పేరు పెట్టింది. మరోవైపు, అమెజాన్, ఉబెర్, యూపీఎస్ తదితర సంస్థలు కూడా డ్రోన్ డెలివరీ అనుమతుల కోసం ఎఫ్ఏఏను సంప్రదిస్తున్నాయి. భారత్‌లో జొమాటో కూడా డ్రోన్ డెలివరీపై ప్లాన్ చేస్తోంది.