గాల్లో పల్టీలు కొట్టిన రేసింగ్ కారు.. ఫార్ములా-3 డ్రైవర్ సేఫ్

Formula 3 driver Alex Peroni walked away from.the crash after taking flight, గాల్లో పల్టీలు కొట్టిన రేసింగ్ కారు.. ఫార్ములా-3 డ్రైవర్ సేఫ్

ఇటలీలోని మోంజాలో ఫార్ములా-3 రేసింగ్ కారు డ్రైవర్ తృటిలో అతి పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఈ రేసింగ్ లో పాల్గొన్న 19 ఏళ్ళ అలెక్స్ పెరోనీ.. అతి వేగంగా తన వాహనంలో దూసుకుపోతుండగా.. హఠాత్తుగా అది అదుపు తప్పి గాల్లో పల్టీలు కొడుతూ … డివైడర్ ను ఢీ కొని అవతలివైపు పడిపోయింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో అలెక్స్ గాయపడకుండా బయటపడ్డాడు. క్వాలిఫయింగ్ సెషన్ లో జరిగిందీ ఘటన.. అనూహ్యంగా జరిగిన ఈ సంఘటన నిర్వాహకులను షాక్ కి గురి చేసింది. అయితే అలెక్స్ సురక్షితంగా వాహనం నుంచి బయటకు రావడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. చెకప్ కోసం అలెక్స్ ను మొదట మెడికల్ సెంటర్ కు, ఆతరువాత ఆసుపత్రికి తరలించారు. తరువాతి రేసింగ్ లో ఈ యువకుడు పాల్గొనబోడని వారు ప్రకటించారు. ఫార్ములా-2 రేసర్ ఆంథోనీ హ్యూబర్ట్ ఇలాంటి రేసింగ్ లోనే ప్రమాదానికి గురై మరణించి వారం కాకముందే ఈ ఘటన జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *