ఐ యామ్ ఫుల్లీ ఫిట్…వధువు కోసం 84 ఏళ్ల వృద్ధుడి యాడ్

4-YO Man's Old Matrimonial Ad Has The Internet Hooked!, ఐ యామ్ ఫుల్లీ ఫిట్…వధువు కోసం 84 ఏళ్ల వృద్ధుడి యాడ్" srcset="https://tv9telugu.com/wp-content/uploads/2019/07/omm-1.png 780w, https://tv9telugu.com/wp-content/uploads/2019/07/omm-1-300x180.png 300w, https://tv9telugu.com/wp-content/uploads/2019/07/omm-1-768x461.png 768w, https://tv9telugu.com/wp-content/uploads/2019/07/omm-1-600x360.png 600w" sizes="(max-width: 780px) 100vw, 780px" />

ఆయనకట ఒక పిల్లను చూడండి. పెళ్లి చేసుకోవాలని తెగ ముచ్చటపడుతున్నాడు. వయసు మాత్రం 84 ఏళ్లు. మీరేం కంగారు పడాల్సిన పనిలేదు. తన కళ్లు, పళ్లు, మోకాళ్లు, చెవులు బాగానే పనిచేస్తున్నాయని క్లారిటీ ఇచ్చాడు. అంతేనా తనకు రూ.3 కోట్లు విలువ చేసే ఇల్లు ఉందని, బ్యాంకులో రూ.5 లక్షలు ఎఫ్‌డీ ఉందని తెలిపాడు. స్మోకింగ్, డ్రింకింగ్ చేయనని, తాను శాఖాహారినని చెప్తున్నాడు.

ఇదంతా ఏ మ్యారేజ్ బ్యూరోలో ప్రయివేట్ జరిగిన తంతు కాదండోయో..ఏకంగా స్వయంగా ఆ వృద్ధుడే పేపర్ ప్రకటన ఇచ్చాడు. పాపం ఆ వయసులో ఆయన ఒంటిరితనంతో బాధపడుతున్నారో..లేక కొడుకులు, కూతుర్లు పట్టించుకోక కోపంతో ప్రకటన ఇచ్చాడో తెలియదు కానీ ఈ న్యూస్ పేపర్ కటింగ్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎంతైనా ఈ వయసులో ఆయన డేర్‌ను మెచ్చుకోవాల్సిందే. కాకపోతే నెటిజన్లే కొంతమంది అయ్యో పాపం అంటుంటే..మరికొందరు మాత్రం నాటీ గ్రాండ్ పా అంటూ సెటైర్లు వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *