జోరుగా హెచ్-1 బీ వీసాల స్క్రూటినీ

అమెరికాలో హెచ్ 1-బీ వీసాల స్క్రూటినీ జోరుగా సాగుతోంది. యుఎస్ 2019 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి (2018 అక్టోబరు 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు) మొదటి ఆరు నెలల కాలానికి హెచ్-1 బీ వీసాల స్క్రూటినీ కొనసాగిందని అమెరికన్ సిటిజన్ షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఇటీవల రిలీజ్ చేసిన డేటాలో తెలిపింది. పలు కేసుల్లో అదనపు సాక్ష్యాధారాలను ఇమ్మిగ్రేషన్ అధికారులు కోరారని వెల్లడించింది. 48 శాతం అప్లికేషన్లలో రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ లను […]

జోరుగా హెచ్-1 బీ వీసాల స్క్రూటినీ
Follow us

|

Updated on: Jun 13, 2019 | 2:08 PM

అమెరికాలో హెచ్ 1-బీ వీసాల స్క్రూటినీ జోరుగా సాగుతోంది. యుఎస్ 2019 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి (2018 అక్టోబరు 1 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు) మొదటి ఆరు నెలల కాలానికి హెచ్-1 బీ వీసాల స్క్రూటినీ కొనసాగిందని అమెరికన్ సిటిజన్ షిప్, ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ ఇటీవల రిలీజ్ చేసిన డేటాలో తెలిపింది. పలు కేసుల్లో అదనపు సాక్ష్యాధారాలను ఇమ్మిగ్రేషన్ అధికారులు కోరారని వెల్లడించింది. 48 శాతం అప్లికేషన్లలో రిక్వెస్ట్ ఫర్ ఎవిడెన్స్ లను కూడా అభ్యర్థించారు. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది ఒక శాతం ఎక్కువట. 2019 ఆర్ధిక సంవత్సరం..మార్చి 31 వరకు 95 వేలకు పైగా అప్లికేషన్లను పరిశీలించారు. గత ఏడాది మార్చి 31 నాటికి 88 వేలకు పైగా దరఖాస్తులు పరిశీలనకు నోచుకున్నాయి. ఈ సారి సుమారు 60 శాతం వరకు హెచ్-1 బీ వీసాలను భారతీయులకు జారీ చేశారు.ఇతర దేశాలతో పోలిస్తే ఈ విషయంలో ఇండియాయే ముందుంది. అటు-స్పాన్సరింగ్ కంపెనీల నుంచి అదనపు సమాచారాన్ని సేకరించిన అనంతరం ఈ దరఖాస్తుల అప్రూవల్ రేటు తొలి ఆరు నెలల్లో 60.5 శాతం తిరస్కరణకు గురైందని, అంటే 95 వేలకు పైగా అప్లికేషన్లను అప్రూవ్ చేయాల్సి ఉండగా.. కేవలం 57 వేలకు పైగా దరఖాస్తులను ఆమోదించారని ఈ డేటా పేర్కొంది. దీన్ని బట్టి ఈ వీసాల జారీలో ట్రంప్ ప్రభుత్వం కఠిన నిబంధనలను పాటించిందని అంటున్నారు. ఇమ్మిగ్రేషన్ నిబంధనలను గతంలో కన్నా ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ చేయడంతో వీసాల జారీ కొంతవరకు తగ్గిందన్నది వాస్తవం. అభ్యర్థి తన గత అయిదేళ్ల సోషల్ మీడియా ఖాతాల వివరాలను కూడా పొందుపరచాలని ట్రంప్ ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.

మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..