Breaking News
  • మణిపూర్ అసెంబ్లీలో బలనిరూపణలో గెలిచిన బీజేపీ. సభలో 28 మంది బీజేపీ, 16మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల హాజరు. గైర్హాజరైన 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఓటింగ్ అనంతరం నినాదాలతో హంగామా చేసిన కాంగ్రెస్. కుర్చీలను విసిరేసిన నిరసన తెలిపిన కాంగ్రెస్.
  • వెంటిలేటర్ మీద మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ కోసం చేసిన సర్జరీ విజయవంతం.
  • బెజవాడలో మరో గ్యాంగ్ వార్ ఘటన: మున్నా , రాహుల్ అనే వ్యక్తుల మధ్య ఘర్షణ. గత నెల 31 వ తేదీన కేదారేశ్వరావు పేటలో కత్తులు , కర్రలతో దాడి చేసుకున్న ఇరు వర్గాలు. దాడిలో పాల్గొన్న 11 మంది నిందితులు అరెస్ట్ చేసిన పోలీసులు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన.
  • విజయవాడ : మూడో రోజు కొనసాగనున్న అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు. ఇప్పటికే ఎగ్రిమెంట్ పత్రాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు. కొనసాగుతున్న అరెస్టుల పర్వం. సిబ్బంది నిర్లక్ష్యం, భద్రతా ప్రమాణాలు పాటించనకపోవడమే అగ్నిప్రమాదానికి కారణమంటున్న పోలీసులు. అగ్నిప్రమాదంతో కృష్ణా జిల్లా యంత్రాంగం అలెర్ట్. కృష్ణా జిల్లాలోని ప్రైవేటు ఆస్పత్రుల వ్యవహారంపై దృష్టి. కృష్ణా జిల్లాలో ప్రభుత్వ, చిన్నా, చితకా ఆస్పత్రులు, డెంటల్‌ క్లినిక్‌లు, డయాగ్నోస్టిక్‌ కేంద్రాల 1,018 వరకు ఉన్నట్లు గుర్తింపు. వాటిలో భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న 88 ప్రభుత్వ ఆస్పత్రులు, 90 ఇతర ఆస్పత్రులు. 840 ఆస్పత్రులకు అగ్నిమాపక శాఖ అనుమతులేనట్లు గుర్తింపు. చాలా ఆస్పత్రుల్లో కనిపించని అగ్నిప్రమాద నియంత్రణ ఏర్పాట్లు.
  • అమరావతి: రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు, ఎగుమతి, రవాణా, డోర్ డెలివరీకు సంబంధించి ధరలను నిర్ణయించిన ప్రభుత్వం. కూలీల ద్వారా ఇసుక తవ్వకాలకు టన్నుకు రూ. 90. స్టాక్ యార్డు లో ఇసుక పొక్లెయిన్ ద్వారా లోడ్ చేసేందుకు టన్నుకు రూ. 25. ఇసుక రీచ్ లు, పట్టా ల్యాండ్ నుంచి స్టాక్ పాయింట్ కు ఇసుక రవాణా కు టన్నుకు రూ. 4.90. గోదావరి జిల్లాల నుంచి విశాఖకు ఇసుక రవాణాకు టన్నుకు రూ. 3.30. ఇసుక డోర్ డెలివరీకి కిలోమీటర్ వారీగా ధరలు నిర్దారణ. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం కాంట్రాక్టర్లు ముందుకు రాకుంటే ఈ-టెండర్లకు వెళ్లేలా ఆదేశాలు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన గనుల శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది.
  • తూ. గో.జిల్లా, రాజమండ్రి: ఖైదీ ఆత్మహత్య.. రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఆదివారం రాత్రి ఉరేసుకుని కరోనా ఖైదీ ఆత్మహత్య . ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. జైలులో ఇటీవల చేసిన వైద్య పరీక్షల్లో మృతుడికి కరోనా పాజిటివ్‌ అని చెబుతున్న అధికారులు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో మృతదేహం . కుటుంబసభ్యులు ఆసుపత్రి రావడం ఆలస్యంతో మృతదేహానికి నేడు పంచనామా . ఖైదీ స్వగ్రామం పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి మండలం యర్రంపల్లి. మృతుడి భార్య, తండ్రి తదితరులు హైదరాబాదులో నివాసం. భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్థల కారణంగానే ఉరేసుకుని ఉండవచ్చునని పోలీసులు, జైలు అధికారులు భావిస్తున్నారు. ఆసుపత్రి సమాచారంతో ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు.
  • ఏపీ ప్రజలకు శుభవార్త: తగ్గుముఖం పట్టనున్న కరోనా. ఇప్పటికే 15 శాతం పైగా హెర్డ్ ఇమ్యూనిటీ గుర్తింపు. ఈ నెల 21 నుంచి కర్నూలు తూర్పుగోదావరి జిల్లాలలో, వచ్చే నెల 4 నుంచి గుంటూరు కృష్ణ అనంతపురం చిత్తూరు నెల్లూరు జిల్లాలలో భారీగా తగ్గుముఖం పట్టనున్న కరోనా. మరణాల సంఖ్యలో కూడా భారీ తేడా కనిపించబోతుంది. శనివారం నుంచి భారీగా మొదలుకానున్న సిరోసర్విలేన్స్. Covid 19 ఏపీ కమాండ్ కంట్రోల్ రూమ్ స్పెషలాఫీసర్ డాక్టర్ సి ప్రభాకర్ రెడ్డి.

ఈ జరిమానాలతో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయా?

New Motor vehicle Act 2019, ఈ జరిమానాలతో  రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయా?

సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన నూతన మోటారు వాహన చట్ట సవరణతో వాహనదారుల్లో భయం పట్టుకుంది. వేలకు వేలు చలాన్లు రాస్తూ ట్రాఫిక్ పోలీసులు రికార్డు సృష్టిస్తున్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని ఉక్కుపాదంతో అములు చేస్తున్నాయి. రెండు రోజుల క్రితమే దీన్ని అమల్లోకి తీసుకొచ్చిన కర్ణాటకలో ఏకంగా రూ.72 లక్షలు వసూలు చేసి చరిత్ర సృష్టించారు అక్కడి ట్రాఫిక్ పోలీసులు. అయితే కొంతమంది మాత్రం కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ప్రమాదాల రేటు తగ్గడానికి ఈవిధమైన జరిమానాలు దోహదం చేస్తాయంటున్నారు. కానీ సామన్య, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగాలు, ఉపాధికోసం కుటుంబాలతో కలసి పనులకు వెళ్లే వారికి ఈ నూతన నిబంధనలు గొడ్డలిపెట్టుగా మారాయనే అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.

కొత్త సవరణలు అమలు కానిది ఎక్కడా?

రోడ్డు భద్రతా బిల్లు 2014లో ప్రారంభమై 2019 జూలై 31 న మోటారు వాహన చట్ట సవరణ బిల్లుగా రాజ్యసభలో ఆమోదం పొందింది. దీనికి ఆగస్టు 8న రాష్ట్రపతి ఆమోదం కూడా తెలిపారు. ఇందులో ఉన్న అంశాలు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. అయితే కేంద్రం దీనిపై నోటిఫికేషన్ విడుదల చేసినా కొన్ని రాష్ట్రాలు మాత్రం ఇప్పటికే అమలు చేయడం లేదు. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు ఈ చట్ట సవరణను ఇప్పటికిప్పుడే అమలు చేసేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. కొంతకాలం ఆపినట్టుగా తెలుస్తోంది. ఈ నూతన చట్ట సవరణలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటన చేసింది.

రాజ్యసభలో అడ్డుకోలేకపోయారు..

నిజమే.. గతంలో ఇంత దారుణమైన పరిస్థితి ఎన్నడూ లేదు. ప్రతి అతిక్రమణకు వేలకు వేలు వడ్డించిన దాఖలాలు లేవు. ద్విచక్రవాహన ధర కంటే మించి జరిమానాలు విధిస్తుండటంతో ఆయా వాహనదారులు వాటిని అక్కడే వదిలేసి వెళ్తున్నారు. మరికొందరు ప్రభుత్వంపై ఆగ్రహంతో తగులబెట్టుకుంటున్నారు. ఈ పరిస్తితి ఎందుకొచ్చిందనే సందేహాలు కొందరిని వేధిస్తున్నాయి. అయితే రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పుడు దీనికి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఓటు వేసి ఉంటే ఇది అమలయ్యేది కాదు. సీపీఐ, సీపీఎం, డీఎంకే పార్టీల సభ్యులు మొత్తం 13 మంది మాత్రమే దీనికి వ్యతిరేకంగా ఓటు వేశారు. దీంతో వీరి ఓట్లు ఈ బిల్లును అడ్డుకోలేకపోయాయి.

వేలకు వేలు జరిమానాలు సరికాదు..

రోజురోజుకు పెరిగిపోతున్న రోడ్డుప్రమాదాల నివారణకు ఇలా ఫెనాల్టీలు వేయడం పరిష్కారమా అని ఎంతోమంది ప్రశ్నిస్తున్నారు. ఫైన్ వేస్తారనుకుంటే మరీ ఇంత దారుణంగా నా అంటూ నోరెళ్లబెట్టాల్సి వస్తోందని మరికొంతమంది అవాక్కవుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో జరిమానాలు విధించడం దేనికి సంకేతమో అర్ధంకాక సామన్య, మధ్యతరగతి వర్గానికి చెందిన వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే రహదారి నిబంధనలు, ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినవారిపై శిక్షలు వేయడం సబబే.. కానీ మనీ ఇంతగా వేయడమే సరికాదు అనే వాదన సర్వత్రా వినిపిస్తోంది. అసలు ఉల్లంఘనలు ఎందుకు జరుగుతున్నాయో, ప్రమాదాలకు కారణాలు ఏమిటో పరిశోధన చేయకుండా కేవలం వేలకు వేలు జరిమానాలు విధించడంపై నిరసన వ్యక్తమవుతోంది.

గ్రామాలు మొదలు మెట్రో నగరాల వరకు విపరీతంగా వాహనాలు పెరిగిపోవడం, వాహనాలు కొనుగోలుకు విచ్చలవిడిగా రాయితీలు ఇచ్చి ప్రోత్సహించడం ప్రమాదాలకు ప్రధాన కారణం, వాహనాలు నడిపే వారికి రోడ్డు భద్రతా, రహదారి నిబంధనలపై సరైన అవగాహన లేకపోవడం మరో కారణం, ఈ రెండు అంశాలపై వాహనదారుల్లో చైతన్యం కలిగించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందుతున్నాయన్నే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు రోడ్లు కూడా సరిగా లేకుండా ఎక్కడికక్కడే గుంతలతో అస్తవ్యస్తంగా ఉండటం కూడా ప్రభుత్వ పాలనా తీరుకు నిదర్శనంగా నిలుస్తుంది.  భారతీయ రోడ్లు ఎలా ఉంటాయో.. మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా వాహన కంపెనీలు తమ ప్రకటనల్లో ఆయా వాహనాల కెపాసిటీని చెబుతాయి. అదే సమయంలో మన రోడ్లపై అవి ఏవిధంగా నడవగలవో మాత్రం చెప్పవు. దీనివల్ల వాహనదారులు కొత్త వాహనాలు కొనుగోలు చేస్తూ రోడ్లపై ఉన్న లోపాలతో ప్రమాదాలకు కారణమవుతున్నారు.

నిబంధనలు అతిక్రమించారనే నెపంతో సామాన్య, మధ్యతరగతికి చెందిన ఎంతోమందిని వేధిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు. ఒక సాధారణ ఆటో డ్రైవర్ తను రోజంతా కష్టపడితే వచ్చేదాంట్లో మిగిలేది దాదాపు రూ.500లు. అయితే ట్రాఫిక్ రూల్స్ అతిక్రమించాడనే నెపంతో మొదటిసారి వెయ్యి రూపాయలు ఫైన్ విధిస్తున్నారు. అదే రెండోసారి అయితే ఇది మరింత పెరుగుతుంది. ఇది ఒక రకంగా సామాన్యులపై యుద్ధమే అనాల్సి వస్తుందని మామూలు జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సిగ్నల్ జంపింగ్, రాంగ్ రూట్, హెల్మెట్ నిబంధనలతో కట్టాల్సిన రూ.100, రూ.200ల జరిమానాలే కట్టకుండా తప్పించుకుని తిరిగే మధ్యతరగతి వాహనదారులు లక్షల్లో ఉన్నారు. ఇప్పుడు వేలకు వేలు కట్టమంటే వీరు ఏ విధంగా చెల్లిస్తారో అర్ధంకాని పరిస్థితి.

ప్రభుత్వం ఇలా చెబుతోంది..

సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన నూతన మోటారు వాహన సవరణ చట్టంతో ప్రమాదాలు తగ్గుతాయని బలంగా నమ్ముతోంది కేంద్ర ప్రభుత్వం. రోడ్డు ప్రమాదాల్లో ప్రతి ఏడాది దాదాపు లక్షా యాబైవేల మంది మరణిస్తున్నారని చెబుతోంది. ఈ మరణాలకు ప్రధాన కారణం డ్రైవర్ల అప్రమత్తత, సరైన నిబంధనలు పాటించకపోవడమే అని చెబుతోంది ప్రభుత్వం. అయితే క్షేత్ర స్ధాయిలో చేయాల్సి పనుల్ని వదిలేసి కేవలం డ్రైవర్లనే నిందితులు ప్రభుత్వం చూస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయితే జాతీయ రహదారులను వివిధ లైన్లుగా విభజించకుండా ప్రమాదాలు జరుగుతున్నాయి అంటే ఎలా అంటున్నారు డ్రైవర్లు. ఒకే రోడ్డుపై భారీ ,మధ్య తరహా, చిన్న తరహా వాహానాలు, ద్విచక్ర వాహానాలు అన్నీ ఒకే రోడ్డుపై ప్రయాణిస్తుండటంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయనే సత్యం ప్రభుత్వం గుర్తించడం లేదనే విమర్శ ఉంది. ముఖ్యంగా ఆయా రోడ్లను సరిగ్గా తీర్చిదిద్దకపోవడం, మౌళిక సౌకర్యాలు కల్పించకపోవడం వంటివి ప్రభుత్వం తరపున చేయాల్సి విధులు కానీ వాటిని చేయకుండా ప్రమాదాలకు డ్రైవర్లే కారణమనే విధంగా జరిమానాలు విధించడం సరికాదంటున్నారు.

వాహనదారుల్లో వ్యతిరేకత

ప్రభుత్వాలు పాటించాల్సిన విధులు పాటించకుండా.. కేవలం వేలకు వేలు జరిమానాలు విధించినంత మాత్రాన ప్రమాదాలు తగ్గే అవకాశాలు లేవు. ఇప్పటికే వాహనదారుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎవరి రక్షణ కోసం ఇలాంటి ఫైన్‌లు విధిస్తూ చట్ట సవరణ చేశారో.. ఆ ప్రజలు కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. ముఖ్యంగా పూర్తి అవగాహన కల్పించకుండా, రోడ్లు సరిచేయకుండా తమ జేబులకు చిల్లు పెట్టవద్దంటూ వేడుకుంటున్నారు. రోజంతా కష్టపడితే వచ్చిది ఇలా జరిమానాల రూపంలో కట్టుకుంటూ పోతే తాము బతికేది ఎలా అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

Related Tags