హైదరాబాద్ ఆల్విన్ చౌరస్తాలో భారీ పేలుడు

హైదరాబాద్ భారీ పేలుడు సంభవించింది. మియాపూర్ ఆల్విన్ చౌరస్తా లో ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం(జూన్ 30) తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో రసాయనాలను తరలిస్తున్న లారీలో..

హైదరాబాద్ ఆల్విన్ చౌరస్తాలో భారీ పేలుడు
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jun 30, 2020 | 7:24 AM

హైదరాబాద్ భారీ పేలుడు సంభవించింది. మియాపూర్ ఆల్విన్ చౌరస్తా లో ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం(జూన్ 30) తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో రసాయనాలను తరలిస్తున్న లారీలో భారీ పేలుడు జరిగింది.  దీంతో లారీలో ఒక్కసారిగా మంటలు మంటలు చెలరేగాయి.  సకాలంలో స్పందించిన పోలీసులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రాత్రి సమయం కావడంతో జనసంచారం పెద్దగా లేదు.. ఇది మరో అర్ధగంట తర్వాత జరిగి ఉండివుంటే భారీ ప్రాణ నష్టం జరిగివుండేదని స్థానికులు అనుకుంటున్నారు. డ్రైవర్ సమయస్ఫూర్తితో ట్రక్కు నుంచి దూకేయడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు.