Breaking News
  • నల్గొండ: ధర్మారెడ్డిపల్లి కాల్వను పూర్తిచేసి రైతులకు నీరు ఇవ్వాలి. రైతుల ఆత్మహత్యలలో దేశంలో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. మిగులు బడ్జెట్‌ ఉన్న తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చారు. అన్ని ప్రాంతాలను సమానంగా చూస్తేనే సీఎం అని అనిపించుకుంటారు. రైతు బంధు నిధులను వెంటనే విడుదల చేయాలి-కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • కరీంనగర్‌: అల్గునూర్‌ బ్రిడ్జి పైనుంచి పడ్డ కారు. కారులో ప్రయాణిస్తున్న భర్త మృతి, భార్యకు గాయాలు. కాపాడేందుకు వెళ్లిన కానిస్టేబుల్‌ చంద్రశేఖర్‌కు గాయాలు. మృతుడు కరీంనగర్‌కు చెందిన శ్రీనివాస్‌గా గుర్తింపు. కొమురవెళ్లి జాతరకు వెళ్తుండగా ఘటన.
  • సిద్దిపేట: జగదేవపూర్‌లో ఉద్రిక్తత. చైర్మన్‌ పదవి కోసం రెండువర్గాలుగా చీలిన టీఆర్‌ఎస్. ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి వర్గాల మధ్య ఘర్షణ. శ్రీనివాస్‌రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి ఆత్మహత్యాయత్నం. అడ్డుకున్న పోలీసులు.
  • చెన్నై: విల్లుపురం జిల్లా సెంజిలో అగ్రవర్ణాల దాష్టీకం. పొలాల్లో మల విసర్జన చేశాడని యువకుడిని కొట్టిన అగ్రవర్ణాల పెద్దలు. యువకుడికి తీవ్రగాయాలు, పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు. గాయాలతో ఉన్న యువకుడిని ఇంటికి పంపిన పోలీసులు. ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే యువకుడు మృతి. కుటుంబ సభ్యులు, దళిత సంఘాల ఆందోళన. దాడి చేసినవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌.
  • బాబు మాజీ పీఎస్‌ శ్రీనివాస్‌ ఇంట్లో ఐటీ దాడులపై రాజకీయ రచ్చ. వైసీపీ, టీడీపీ పరస్పర విమర్శలు. ట్విట్టర్‌లో చంద్రబాబుపై విజయసాయి ధ్వజం. కౌంటర్‌ ఎటాక్‌ చేసిన టీడీపీ నేతలు. శ్రీనివాస్‌ కమిట్‌మెంట్‌ను మెచ్చుకోవాలి. యజమాని ప్రతి లావాదేవీని డైరీలో రాసుకున్నాడు. దోచుకున్నవి, దొంగ లెక్కలను పర్‌ఫెక్ట్‌గా రికార్డ్‌ చేశాడు-విజయసాయి. దోపిడీదారులు నిప్పుకణికల్లా బిల్డప్‌ ఇస్తుంటారు-విజయసాయి. టీడీపీపై దుష్ప్రచారం చేస్తే చట్టపర చర్యలు-యనమల. ఐటీ దాడులను భూతద్దంలో చూపించారు-యనమల. రూ.2 వేల కోట్ల నగద అని ప్రచారం చేశారు. చంద్రబాబుకు వైసీపీ నేతలు క్షమాపణ చెప్పాలి-యనమల. శ్రీనివాస్‌ ఇంట్లో వేల కోట్లు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేశారు-బుచ్చయ్య. వైవీ సుబ్బారెడ్డి మైనింగ్‌లపై విచారణ చేయాలి-బుచ్చయ్య.

ఆ రెండు పద్ధతులు పాటిస్తే.. కరోనా పరార్..!

Coronavirus outbreak: Experts suggest fresh air, ventilation may avert Coronavirus infection, ఆ రెండు పద్ధతులు పాటిస్తే.. కరోనా పరార్..!

కరోనా వైరస్‌ చైనాతో సహా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. రోజురోజుకీ విస్తరిస్తూ విలయతాండవం చేస్తోంది. దీని నివారణకు ఇంతవరకు అధికారికంగా ఔషధం కనిపెట్టలేదు. ఈ వ్యాధి వలన మరణించిన వారి సంఖ్య అధికంగానే ఉన్నప్పటికీ, తగ్గి ఇంటికి క్షేమంగా తిరిగి వెళ్లినవారు కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలో చక్కగా గాలి, వెలుతురు తగిలే ప్రదేశాలలో రోగులను ఉంచటం వలన కరోనా వైరస్‌ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడతాయని నిపుణులు సూచిస్తున్నారు. అంతే కాకుండా… తమ ఏసీలను ఆపేసి ఫ్యాన్లను వాడమంటూ కూడా వారు సలహా ఇస్తున్నారు. చేతులను శుభ్రంగా కడుక్కోవటం, ఫ్యాన్లను వాడి తాజా గాలిలోఉండటం ద్వారా కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని వారు అంటున్నారు.

ఈ వైరస్‌ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచదేశాలన్నీ మరింత అప్రమత్తమయ్యాయి. తమ దేశాల్లో హై అలర్ట్‌ ప్రకటించాయి. కరోనా సూక్ష్మజీవులు పొడిగా, చల్లగా ఉండే వాతావరణంలో అధికంగా వృద్ది చెందుతాయి. వెచ్చని వాతావరణం కలిగిఉన్న సింగపూర్‌లో ఈ వ్యాధి విస్తరణ తక్కువగా ఉంది. కాగా సింగపూర్‌లో ఇప్పటి వరకు కేవలం 45 కేసులు నమోదయ్యాయి. ఈ విషయమై సింగపూర్‌ వైద్య ఆరోగ్య శాఖ ఛీఫ్‌ సైంటిస్ట్‌ ప్రొఫెసర్‌ టాన్‌ ఖోర్‌ ముఖ్య విషయాలను వెల్లడించారు.

ఈ వైరస్‌ వుహాన్‌లోని ఓ సముద్రపు ఆహార ఉత్పత్తుల మార్కెట్‌ లో వ్యాపించినట్లు అధికారులు గుర్తించారు. కరోనా వైరస్‌ నివారణ చర్యలకు నేతృత్వం వహించటానికి సింగపూర్‌ ప్రభుత్వం నియమించిన ఎనిమిది మంది నిపుణుల బృందంలో ఆయన ఒకరు. కరోనా వ్యాధిని నిరోధించటానికి ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెంటిగ్రేడుకు పైన… గాలిలో తేమ శాతం 80 కి పైగా ఉన్న వాతావారణం ఉత్తమం. అంతేకాకుండా బహిరంగ ప్రదేశాల్లో కరోనా వైరస్‌ వ్యాప్తి తక్కువగా ఉంటుందని తెలుస్తోంది.

చైనాలోని వుహాన్‌లో బయటపడిన కరోనా వైరస్ 25 దేశాలకు విస్తరించింది. కరోనా సోకిందని అనుమానం ఉన్నవారు తమ గది తలుపులు, కిటికీలను తెరిచి ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు. సూర్యుని నుంచి వచ్చే అల్ట్రా వయొలెట్‌ కిరణాలు కరోనా వైరస్‌ను చంపగలవని మరో శాస్త్రవేత్త ప్రొఫెసర్‌ వాంగ్‌ లింఫా అభిప్రాయపడుతున్నారు. సూర్యకాంతిలో కొంతసేపు ఉండటం వలన లభించే విటమిన్‌-డి తో రోగనిరోధక వ్యవస్థ కూడా బలోపేతమవుతుందని ఆయన అంటున్నారు.