రియల్ ఎస్టేట్ సవాళ్ళు అత్యంత కీలకం

ఆర్థిక రంగంలో మరో కీలక సెక్టార్ రియల్‌ ఎస్టేట్. ఒక్కోసారి ఆకాశాన్నంటే వృద్ధితో దూసుకుపోతుంది…మరోసారి ఊహించని విధంగా పతనమవుతూ ఉంటుంది. హైదరాబాద్‌లో కాస్త పర్వాలేదనిపించినా..ఏపీలో రియల్ ఎస్టేట్ కొంచెం ఇష్టం..కొంచెం కష్టం అన్నట్లుగా మారింది. నోట్ల రద్దు తర్వాత ఈ రంగం పూర్తిగా పడిపోయింది. గత పదేళ్లలో వృద్ధి 12.8 శాతం నుంచి 5.7 శాతానికి పడిపోయింది. ఈ రంగం వాటా కూడా 13.4 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గిపోయింది. ఈ గణాంకాలు చూస్తే చాలు…రియల్ […]

రియల్ ఎస్టేట్ సవాళ్ళు అత్యంత కీలకం
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: Feb 01, 2020 | 9:11 AM

ఆర్థిక రంగంలో మరో కీలక సెక్టార్ రియల్‌ ఎస్టేట్. ఒక్కోసారి ఆకాశాన్నంటే వృద్ధితో దూసుకుపోతుంది…మరోసారి ఊహించని విధంగా పతనమవుతూ ఉంటుంది. హైదరాబాద్‌లో కాస్త పర్వాలేదనిపించినా..ఏపీలో రియల్ ఎస్టేట్ కొంచెం ఇష్టం..కొంచెం కష్టం అన్నట్లుగా మారింది. నోట్ల రద్దు తర్వాత ఈ రంగం పూర్తిగా పడిపోయింది.

గత పదేళ్లలో వృద్ధి 12.8 శాతం నుంచి 5.7 శాతానికి పడిపోయింది. ఈ రంగం వాటా కూడా 13.4 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గిపోయింది. ఈ గణాంకాలు చూస్తే చాలు…రియల్ ఎస్టేట్ రంగం ఎలాంటి పరిస్థితిలో ఉందో అర్థమవుతుంది. పదేళ్లలో సగానికి సగం పడిపోయిన ఈ రంగాన్ని బలమైన పునాదులతో గట్టి నిర్మాణం చేపడితే కానీ ఈ రియల్ బిల్డింగ్ నిలవందంటున్నారు నిపుణులు.

ప్రస్తుతం ఈ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు చాలానే ఉన్నాయి.. దీర్ఘకాలిక రుణాలు రియల్‌ రంగానికి పెద్ద సమస్యగా మారాయి. బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి భారీ ప్రాజెక్టుల కోసం తీసుకునే దీర్ఘకాలిక రుణాలపై వడ్డీరేట్లు తగ్గించాలని రియల్ రంగం కోరుకుంటోంది… ప్రస్తుతం రియల్‌ ఎస్టేట్‌ రంగంలో భారీగా అమ్ముడు పోని ఆస్తులు ఉన్నాయి. వీటిల్లో ముఖ్యంగా చాలా ప్రాజెక్టులు నిర్మాణాల దశలోనే ఆగిపోయాయి.

అంతేకాదు రియల్‌ ఎస్టేట్‌ అనుబంధ రంగాలపై జీఎస్‌టీ ప్రభావం తీవ్రంగా ఉంది. చివరకు ఈ భారమంతా ప్రాజెక్టులపై పడి ధర కూడా పెరుగుతోంది. నిర్మాణ రంగ ఖర్చులు తడిసిమోపడవుతున్నాయి.. ముఖ్యంగా నిర్మించి లీజుకు ఇచ్చే ప్రాజెక్టులకు రుణ లభ్యత లేక ఇబ్బంది పడుతున్న సమయంలో ఇది అదనపు భారంగా మారింది. మరి ఈ రంగం నిలబడాలంటే కేంద్రం కొన్ని వరాలు ఇవ్వక తప్పదు. కొనకుండా మిగిలిపోయిన స్థిరాస్తులను సులువుగా విక్రయించేలా కేపిటల్ గెయిన్స్‌కు ఒకసారి మినహాయింపు ఇవ్వాలని రియల్‌ ఏస్టేట్‌ వ్యాపారులు కోరుతున్నారు.

దీంతోపాటు స్థిరాస్తులకు సంబంధించిన నష్టాలను రోల్‌బ్యాక్‌ చేసుకొనే అవకాశం ఇవ్వాలని…ప్రస్తుతం ఇది కేవలం 2 లక్షలు మాత్రమే ఉందంటున్నారు వ్యాపారులు…తొలిసారి ఇల్లు కొనేవారికి జీఎస్‌టీ నుంచి పూర్తి మినహాయింపు ఇస్తే అమ్మకాలు పెరుగుతాయని… ప్రస్తుతం స్థిరాస్తి రంగంలో మిగిలిపోయిన నిర్మాణాలను విక్రయించేందుకు ఇది ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు. ఇలా చేస్తే ఆయా సంస్థలకు మూలధనం అందుతుందని..దానివల్ల రుణభారం తగ్గే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

అలాగే మార్చి తర్వాత చేపట్టే హౌసింగ్‌ ప్రాజెక్టులకు ట్యాక్స్‌ హాలిడే ఇవ్వాలని కోరుకుంటున్నారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి సంస్థలకు ఏఐఎఫ్‌, ఎఫ్‌సీఐల నుంచి వచ్చిన రుణంపై చెల్లించే వడ్డీకి 5శాతం పన్నురేటు మాత్రమే విధించాలని…ఆర్థిక నిర్మాణ కష్టాల్లో ఉన్న ప్రాజెక్టులకు ప్రభుత్వం రాయితీలుఇస్తే మంచిదని రియల్ ఎస్టేట్ వ్యాపారులు అభ్యర్థిస్తున్నారు. గృహనిర్మాణ రంగం కూడా రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ప్రధాన పెట్టుబడి మార్గం.

ఇప్పుడు గృహనిర్మాణానికి ఎదురుగాలి వీస్తోంది. దీంతో పెట్టుబడులు కూడా చాలా వరకు నిలిచిపోతున్నాయి. ప్రభుత్వం ఇప్పుడు ఇన్ఫ్రా ప్రాజెక్టులపై భారీగా వెచ్చిస్తోంది. దీనిపై రియల్ ఎస్టేట్ రంగం కేంద్ర బడ్జెట్‌పై భారీగా ఆశలు పెట్టుకుంది. అలాగే ప్రభుత్వం బ్యాంకుల్లో చేసే మార్పులపై కూడా రియల్‌ ఎస్టేట్‌ రంగం భారీగా ఆశలు పెట్టుకొంది.

అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.
రాత్రి నిద్రపోయే ముందు ఈ జ్యూస్‌ తాగండి.