Breaking News
  • కరీంనగర్‌: హుజూరాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో టిక్‌టాక్‌ కలకలం. ఆపరేషన్‌ థియేటర్‌లో టిక్‌టాక్‌ చేసిన వైద్యులు. రోగికి ఆపరేషన్‌ చేస్తూ టిక్‌టాక్‌ చేసిన వైద్యుడు శ్రీకాంత్, బృందం. సోషల్‌మీడియాలో వైరలైన వీడియో. వైద్యుల తీరుపై మండిపడుతున్న స్థానికులు.
  • సికింద్రాబాద్‌లో అఖిల భారత పోలీస్‌ బ్యాండ్‌ పోటీల ముగింపు వేడుకలు. హాజరైన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • యాదాద్రి:సర్నేనిగూడెం సర్పంచ్ కుటుంబాన్నిపరామర్శించిన కోమటిరెడ్డి. రూ.50 వేలు ఆర్థిక సాయాన్ని అందజేసిన ఎంపీ కోమటిరెడ్డి. సర్పంచ్‌ కుటుంబానికి నా ప్రగాఢ నానుభూతి తెలియజేస్తున్నా. సర్పంచ్‌ కుటుంబానికి రూ.25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించాలి. నావంతుగా సర్పంచ్‌ కుటుంబాన్ని ఆదుకుంటా. ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తా-ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
  • నిజామాబాద్‌: ఎడపల్లిలో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం. పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన ప్రేమజంట. పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఢిల్లీ: జస్టిస్ ధర్మాధికారి నేతృత్వంలో ఏపీ, టీఎస్ అధికారుల భేటీ. విద్యుత్‌ ఉద్యోగుల విభజన సమస్యలపై సమావేశమైన అధికారులు. ఉదయం అధికారులు, ఉద్యోగుల అభ్యంతరాలు స్వీకరించిన ధర్మాధికారి. ధర్మాధికారి నివేదిక ప్రకారం 655 మంది ఉద్యోగులు.. తమకు భారమవుతున్నారని చెప్పిన ఏపీ డిస్కంలు. కమిటీ నివేదికతో సమస్యలున్నాయన్న టీఎస్ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ. ఉద్యోగుల సమస్య శాంతియుతంగా పరిష్కారమయ్యేందుకే.. నివేదికను అంగీకరిచామన్న తెలంగాణ సీఎండీ ప్రభాకర్‌రావు. విధుల్లోకి చేర్చుకోనందు వల్ల ఇబ్బందులు పడుతున్నట్టు.. ధర్మాధికారికి తెలిపిన ఏపీకి కేటాయించిన ఉద్యోగులు. సమస్యకుపరిష్కారం నివేదిక నుంచి తెచ్చేలా ప్రయత్నిద్ధాం-ధర్మాధికారి. సమస్యను మొదటికితెచ్చి ఉద్యోగుల విభజనను జఠిలం చేయొద్దు-ధర్మాధికారి.

ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్: విశాఖకు వచ్చేవి ఇవే

executive capital vizag city, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్: విశాఖకు వచ్చేవి ఇవే

ఏపీ ముఖ్యమంత్రి జగన్ నెల రోజుల క్రితం చేసిన ప్రకటనే యాజ్ ఇట్ ఈజ్‌గా సోమవారం అసెంబ్లీ ముందుకు బిల్లు రూపంలో వచ్చింది. హైపవర్ కమిటీ ఇచ్చిన నివేదికను ఆమోదించిన కేబినెట్.. దాన్ని బిల్లు రూపంలో అసెంబ్లీ ముందుకు తీసుకొచ్చింది. విశాఖను.. ఎగ్జిక్యూటివ్ కేపిటల్, అమరావతిని లిజిస్టేటివ్ క్యాపిటల్, కర్నూలును జ్యూడిషియల్ క్యాపిటల్‌గా ప్రతిపాదిస్తూ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభలో బిల్లును ప్రవేశపెట్టారు.

విశాఖే అన్నింటికన్నా ముఖ్యం

మూడు రాజధానుల ప్రతిపాదనలో విశాఖపట్నం నగరానికే ఎక్కువ ప్రయోజనమని తేటతెల్లమైంది. అయితే గతంలో జీఎన్ రావు కమిటీ, బోస్టన్ గ్రూపులిచ్చిన నివేదిక నుంచి ఒకట్రెండె అంశాలను మాత్రం మినహాయించినా… సచివాలయం, రాజ్‌భవన్, అన్ని ప్రభుత్వ విభాగాల అధిపతుల కార్యాలయాలు.. ఇలా అన్నీ విశాఖ నగరంలోనే ఏర్పాటు కానున్నాయి. శాసనసభా కార్యకలాపాలు నిర్వహించే సచివాలయం మాత్రం అమరావతిలో ఏర్పాటు కానుంది. అంటే.. సంవత్సరానికి మూడు, నాలుగు సార్లు జరిగే అసెంబ్లీ సమావేశాల సమయంలో తప్ప మిగితా అధికారిక కార్యక్రమాలన్నీ విశాఖలోనే జరుగుతాయి. సచివాలయం సెలవు దినాలు మినహా సంవత్సరం పొడవునా.. యాక్టివ్‌గా వుంటుంది కాబట్టి ఎక్కువ ఫోకస్ విశాఖ నగరంపైనే అన్నది నిర్వివాదాంశం.

Related Tags