అక్కడ కిలో ప్లాస్టిక్ కు.. మీల్స్ ఫ్రీ..

Exchange Plastic Waste In Ambikapur Garbage Cafe And Get Free Meal, అక్కడ కిలో ప్లాస్టిక్ కు.. మీల్స్ ఫ్రీ..

పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా ప్లాస్టిక్‌ వ్యర్థాలు ముంచెత్తుతున్నాయి. వీధుల్లో… బహిరంగ ప్రదేశాల్లో… ఎక్కడ చూసినా చెత్తమయమై కనిపిస్తోంది. అలాంటి ప్లాస్టిక్ చెత్తను ఒక కేజీ సేకరించి ఇస్తే.. మీకు రుచికరమైన భోజనం లభిస్తుంది. ఏంటి ఆశ్చర్యపోతున్నారు. ఇది అక్షరాలా నిజమండీ.. అయితే ఈ ఫ్రీ మీల్ కేవలం బిచ్చగాళ్లకు, ఆశ్రయం లేనివారికి మాత్రమే.

ఛత్తీస్‌గడ్‌లోని సురగుజా జిల్లాలో అంబికాపూర్ మున్సిపల్ కార్పొరేషన్ ప్లాస్టిక్‌ను నిషేధించే భాగంలో ఓ కేఫ్‌ను మొదలుపెట్టారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంలో భాగంగా బిచ్చగాళ్లు గానీ.. ఆశ్రయం లేనివారు గానీ ఒక కిలో ప్లాస్టిక్ వ్యర్ధాలను తీసుకువస్తే.. వారికి ఉచితంగా భోజనం పెడుతుంది ఈ ‘గార్‌బేజ్ కేఫ్’. అంతేకాదు అరకేజీ ప్లాస్టిక్ చెత్త తీసుకొచ్చిన వారికి టిఫిన్ ఇస్తారట. చూశారా ఈ ఆలోచన ఎంత బాగుందో. సిటీలో ప్లాస్టిక్ అనేది లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే వారు ఇలాంటి పద్దతిని స్టార్ట్ చేశారని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *