Breaking News
  • విజయనగరంలో జాతీయ స్థాయి ఆదివాసీ సాంస్కృతిక మహోత్సవం. పాల్గొన్న డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి, కలెక్టర్‌ హరి జవహరల్‌లాల్‌.
  • గిరిజన సంక్షేమ బడ్జెట్‌పై హరీష్‌రావు, సత్యవతిరాథోడ్ సమీక్ష. గిరిజనశాఖకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని కోరుతున్నాం. కల్యాణలక్ష్మి, పిల్లలఆహారం, పాలబిల్లులు గ్రీన్ చానెల్‌లో పెట్టాలి. పెరిగిన అవసరాలకనుగుణంగా అదనపు కేటాయింపులు చేయాలి -మంత్రి సత్యవతి రాథోడ్‌. ఉప ప్రణాళిక నిధులు సరిగా ఖర్చయ్యేలా అధికారులు చూడాలి-హరీష్‌రావు.. కేంద్ర నిధులతో పాటు అదనపు నిధులు వచ్చేలా యూసీలు ఇవ్వండి. కేంద్రం నుంచి వచ్చే నిధులు పోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదే. ప్రతి పైసాను చూసి ఖర్చు పెట్టండి-మంత్రి హరీష్‌రావు.
  • ఒడిశా: గంజాం జిల్లా కొయిరాచొట్టలో విషాదం. గడ్డివాముకు మంటలు అంటుకుని ముగ్గురు చిన్నారులు మృతి. మరో చిన్నారి పరిస్థితి విషమం, ఆస్పత్రికి తరలింపు.
  • ఏపీలో ఎక్కడా కొవిడ్‌ వైరస్‌ ప్రభావం లేదు-మంత్రి మోపిదేవి. కొవిడ్‌ వైరస్‌ వల్ల చైనాతో ఉన్న కొన్న వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. దీనివల్ల పౌల్ట్రీ రంగం కుదేలయ్యే అవకాశాలు ఉన్నాయి. పౌల్ట్రీ సెక్టార్‌ను మరింత అభివృద్ధి చేస్తాం-మంత్రి మోపిదేవి.
  • నాగర్‌కర్నూల్‌: పాలెంలో జిల్లా స్థాయి పంచాయతీరాజ్‌ సమ్మేళనం. పాల్గొన్న మంత్రి నిరంజన్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ బాలరాజు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం, పల్లె ప్రగతి పనులపై సమీక్ష.
  • గోవాలో కూలిన మిగ్‌-29కే శిక్షణ యుద్ధ విమానం. టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే కుప్పకూలిన విమానం. ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ పైలెట్‌. ఘటనపై విచారణకు ఆదేశించిన భారత ప్రభుత్వం.

సైకిల్ దిగనున్న మరో మాజీ మంత్రి..?

Ex TDP Minister Adinarayana Reddy Ready to Join in BJP?, సైకిల్ దిగనున్న మరో మాజీ మంత్రి..?

టీడీపీకి ఈ మధ్య షాకుల మీద షాక్‌లు తగులుతున్నాయి. కొంతమంది వైసీపీలోకి వెళ్తుంటే.. మరికొంతమంది బీజేపీలోకి జంప్ అవుతున్నారు. ఇటీవలే.. ఎంపీ గరికపాటి బీజేపీలో చేరారు. ఆయన ఎందుకు జాయిన్ అయ్యారో బీజేపీ సభలోనే వివరణ ఇచ్చారు. ఇప్పుడు తాజాగా బీజేపీలోకి మరో మాజీ మంత్రి జంప్ అవుతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. అందులోనూ.. సీఎం రమేష్‌తో సన్నిహితంగా ఎక్కువగా ఉంటారు కూడా.. దీంతో.. ఆయన బీజేపీలోకి వెళ్లడం ఖాయమని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఆయనెవరనేది తెలుసుకోవాలని ఆసక్తిగా ఉంది కదా.. ఇంకెవరు.. మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి.

ఆదినారాయణరెడ్డి ఇప్పటికే.. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలుపొందారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచి.. టీడీపీలోకి జంప్ అయ్యారు. దీంతో.. వైసీపీపై ఒక రేంజ్‌లో కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. సో.. మళ్లీ వైసీపీలోకి వెళ్లాలంటే.. కష్టం. అందుకే ఆయన బీజేపీలోకి వెళ్లబోతున్నారని సమాచారం. అలాగే.. 2019 తాజా ఎన్నికల్లో ఎంపీగా పోటీచేశారు ఆదినారాయణ రెడ్డి.

Ex TDP Minister Adinarayana Reddy Ready to Join in BJP?, సైకిల్ దిగనున్న మరో మాజీ మంత్రి..?

Related Tags