Breaking: సూర్యాపేటలో దారుణం.. మాజీ సర్పంచ్ దారుణ హత్య..!

సూర్యాపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎక్కారం మాజీ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్న దారుణ హత్యకు గురయ్యారు. ఒంటెద్దు వెంకన్నను రాళ్లతో కొట్టి చంపారు దుండగులు. అయితే రెండు రోజులుగా సహకార సంఘాల ఎన్నిక విషయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య ఘర్షణ జరుగుతోంది. ఈ క్రమంలో వెంకన్నను దారుణంగా హతమార్చారు దుండగులు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. కాగా తెలంగాణలో నేడు సహకార సంఘాల ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 906 పీఏసీఎస్‌లకు కాసేపట్లో […]

Breaking: సూర్యాపేటలో దారుణం.. మాజీ సర్పంచ్ దారుణ హత్య..!
Follow us

| Edited By:

Updated on: Feb 15, 2020 | 6:55 AM

సూర్యాపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎక్కారం మాజీ సర్పంచ్ ఒంటెద్దు వెంకన్న దారుణ హత్యకు గురయ్యారు. ఒంటెద్దు వెంకన్నను రాళ్లతో కొట్టి చంపారు దుండగులు. అయితే రెండు రోజులుగా సహకార సంఘాల ఎన్నిక విషయంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య ఘర్షణ జరుగుతోంది. ఈ క్రమంలో వెంకన్నను దారుణంగా హతమార్చారు దుండగులు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

కాగా తెలంగాణలో నేడు సహకార సంఘాల ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 906 పీఏసీఎస్‌లకు కాసేపట్లో పోలింగ్ మొదలుకానుంది. మధ్యాహ్నం 2గం.ల నుంచి ఓట్ల లెక్కింపు జరగనుండగా.. సాయంత్రం ఫలితాలు వెల్లడికానున్నాయి. ఎన్నికల నిర్వహణ విధుల్లో 747మంది గెజిటెడ్ అధికారులు పాల్గొననున్నారు. దీనికి సంబంధించి పోలింగ్ కేంద్రాలకు ఇప్పటికే బ్యాలెట్ పత్రాలు సరఫరా అవ్వగా.. 12లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.