మనీలాండరింగ్ కేసులో పాక్ మాజీ అధ్యక్షుడు జర్ధారీ అరెస్ట్

మనీలాండరింగ్ కేసులో పాక్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్ధారీ అరెస్టయ్యారు. ఈ కేసులో జర్ధారీ బెయిల్ పిటిషన్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు తిరస్కరించడంతో నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో(ఎన్ఏబీ) అధికారులు ఇస్లామాబాద్‌లోని ఆయన నివాసంలో జర్ధారీని అరెస్టు చేశారు. రేపు(మంగళవారం) ఆయన ఎన్ఏబీ అధికారులు కోర్టు ఎదుట హాజరుపర్చి జైలుకు తరలించనున్నట్లు పాక్ మీడియా తెలిపింది. జర్ధారీ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) కో-ఛైర్మన్‌గానూ వ్యవహరిస్తున్నారు. జర్ధారీ, ఆయన సోదరి ఫర్యాల్ తాల్పర్‌కు పలు బ్యాంకుల్లో నకిలీ అకౌంట్లు ఉన్నాయని, […]

మనీలాండరింగ్ కేసులో పాక్ మాజీ అధ్యక్షుడు జర్ధారీ అరెస్ట్
Follow us

|

Updated on: Jun 10, 2019 | 7:02 PM

మనీలాండరింగ్ కేసులో పాక్ మాజీ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్ధారీ అరెస్టయ్యారు. ఈ కేసులో జర్ధారీ బెయిల్ పిటిషన్‌ను ఇస్లామాబాద్ హైకోర్టు తిరస్కరించడంతో నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో(ఎన్ఏబీ) అధికారులు ఇస్లామాబాద్‌లోని ఆయన నివాసంలో జర్ధారీని అరెస్టు చేశారు. రేపు(మంగళవారం) ఆయన ఎన్ఏబీ అధికారులు కోర్టు ఎదుట హాజరుపర్చి జైలుకు తరలించనున్నట్లు పాక్ మీడియా తెలిపింది. జర్ధారీ పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ) కో-ఛైర్మన్‌గానూ వ్యవహరిస్తున్నారు.

జర్ధారీ, ఆయన సోదరి ఫర్యాల్ తాల్పర్‌కు పలు బ్యాంకుల్లో నకిలీ అకౌంట్లు ఉన్నాయని, నల్లధనాన్ని ఇందులో దాచినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై ఎన్ఏబీ కేసులు వేయడంతో వారు ముందస్తు బెయిల్ కోసం ఇస్లామాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు ద్విసభ్య బెంచ్ సోమవారం తిరస్కరించింది. జర్ధారీతో పాటు ఆయన సోదిరిని అరెస్టు చేసేందుకు ఎన్ఏబీకి కోర్టు అనుమతి మంజూరు చేసింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో జర్ధారీ బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
ఐపీఎల్ నుంచి ఐదుగురు నిషేధం.. హిట్ లిస్టులో అగ్రస్థానం ఆయనదే?
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.