మాజీలు.. వారంలోగా బంగ్లాలు ఖాళీ చేయండి లేకపోతే..

తమ పదవీకాలం ముగిసి మూడు నెలలు గడుస్తున్నా.. ఇంకా వారి బంగ్లాలను ఖాళీ చేయడంలేదు కొందరు మాజీ ఎంపీలు. దీంతో వారికి ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. వారంలోగా భవనాలు ఖాళీ చేయాలని మాజీ ఎంపీలకు సూచించింది. ముఖ్యంగా లుటెయిన్స్‌ ప్రాంగణంలోని బంగ్లాల్లో నివాసముంటున్న మాజీ ఎంపీలు వెంటనే ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాదు చివరి మూడు రోజులూ విద్యుత్‌, నీటి సరఫరా కూడా నిలిపివేయాలని ఆదేశించినట్లు హౌసింగ్‌ కమిటీ ఛైర్మన్ సీఆర్‌ పాటిల్‌ వెల్లడించారు. […]

మాజీలు.. వారంలోగా బంగ్లాలు ఖాళీ చేయండి లేకపోతే..
Follow us

| Edited By:

Updated on: Aug 19, 2019 | 9:07 PM

తమ పదవీకాలం ముగిసి మూడు నెలలు గడుస్తున్నా.. ఇంకా వారి బంగ్లాలను ఖాళీ చేయడంలేదు కొందరు మాజీ ఎంపీలు. దీంతో వారికి ప్రభుత్వం డెడ్ లైన్ విధించింది. వారంలోగా భవనాలు ఖాళీ చేయాలని మాజీ ఎంపీలకు సూచించింది. ముఖ్యంగా లుటెయిన్స్‌ ప్రాంగణంలోని బంగ్లాల్లో నివాసముంటున్న మాజీ ఎంపీలు వెంటనే ఖాళీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాదు చివరి మూడు రోజులూ విద్యుత్‌, నీటి సరఫరా కూడా నిలిపివేయాలని ఆదేశించినట్లు హౌసింగ్‌ కమిటీ ఛైర్మన్ సీఆర్‌ పాటిల్‌ వెల్లడించారు.

ఢిల్లీలోని లుటెయిన్స్‌ ప్రాంగణంలో దాదాపు 200 మంది మాజీ ఎంపీలు బంగ్లాల్లో నివసిస్తున్నారు. 16వ లోక్‌సభ రద్దైనప్పటికీ వీరు ఇంకా వాటిలోనే ఉంటున్నారు. వాస్తవానికి సభ రద్దైన నెల రోజుల్లోగా తమకు కేటాయించిన బంగ్లాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది. మే 25న 16వ లోక్‌సభ రద్దు కాగా.. జూన్‌ 25 నాటికే వీరు ఖాళీ చేయాల్సింది. కానీ నేటికీ కొందరు అవే భవనాల్లో కొనసాగుతున్నారు.