మళ్లీ సొంతగూటికి సాయి ప్రతాప్..!

కడప జిల్లాకు చెందిన మాజీ కేంద్ర మంత్రి సాయి ప్రతాప్ మరోసారి కాంగ్రెస్‌లో చేరారు. యూపీఏలో హయాంలో రాజంపేట నుంచి లోక్‌సభకు ఎన్నికై కేంద్రంలో మంత్రిగా కూడా పని చేసిన సాయి ప్రతాప్.. కాంగ్రెస్ ఓటమి తర్వాత తెలుగుదేశంలో చేరారు. ఇటీవలి ఎన్నికల్లో రాజంపేట టిక్కెట్ ఆశించి భంగపడ్డ సాయిప్రతాప్ తిరిగి సొంతగూటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తన ప్రాణం ఉన్నంతవరకూ కాంగ్రెస్‌లోనే ఉంటానని చెప్పారాయన. బలహీన వర్గాలకు కాంగ్రెస్‌లోనే న్యాయం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన కాంగ్రెస్‌కే మద్దతివ్వాలని సూచించారు ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. సాయిప్రతాప్‌ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *