ఇక ఇక్కడ బాబు ఉండరు.. రారు కూడా..!

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం కూల్చివేతపై గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కాగా.. నివాసం ఖాళీ చేయాలని ఏపీ ప్రభుత్వం, సీఆర్డీఏ మాజీ సీఎం చంద్రబాబు ఇంటికి నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. ఈ సందర్భంగా.. చంద్రబాబును కలిసిన మాజీ ఎంపీ రాయపాటి మాట్లాడుతూ.. సీఆర్డీఏ నోటీసులు ఇచ్చాక ఆయన ఈ నివాసంలో ఉండరని, ఇటువైపు రాను కూడా రారని పేర్కొన్నారు. ఆయన గుంటూరు పార్టీ ఆఫీస్ దగ్గరలో ఉంటారని తెలిపారు. బాబును మా […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:47 am, Sat, 29 June 19

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం కూల్చివేతపై గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కాగా.. నివాసం ఖాళీ చేయాలని ఏపీ ప్రభుత్వం, సీఆర్డీఏ మాజీ సీఎం చంద్రబాబు ఇంటికి నోటీసులు జారీ చేసిన విషయం విదితమే. ఈ సందర్భంగా.. చంద్రబాబును కలిసిన మాజీ ఎంపీ రాయపాటి మాట్లాడుతూ.. సీఆర్డీఏ నోటీసులు ఇచ్చాక ఆయన ఈ నివాసంలో ఉండరని, ఇటువైపు రాను కూడా రారని పేర్కొన్నారు. ఆయన గుంటూరు పార్టీ ఆఫీస్ దగ్గరలో ఉంటారని తెలిపారు. బాబును మా ఇంట్లోనే ఉండమని అడిగాను, కానీ ఆయన అది సవ్యం కాదన్నారు. అలాగే.. చంద్రబాబును కలిసేందుకు రైతులు పెద్దఎత్తున వచ్చారని, వారు కూడా ఆయన వెళ్లిపోవడాన్ని తట్టుకోలేక కన్నీరుపెట్టుకున్నారు. వెంకటపాలెంలో రైతులు ఇల్లు కట్టి ఇస్తామంటున్నారు.. అయినా చంద్రబాబు వద్దన్నారని ఎంపీ రాయపాటి తెలిపారు.