దసరా తొలిరోజు దుర్గమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ : దేవినేని ఉమ

బెజవాడ కనకదుర్గ అమ్మవారిని మాజీమంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు దర్శించుకున్నారు. వినాయకుడి గుడి నుండి కాలినడకన క్యూలైన్లో నడుచుకుంటూ కొండపైకి వచ్చి ఉమ.. అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ “అమ్మలగన్నమ్మ దుర్గమ్మను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం కాలినడకన దసరా తొలి రోజు అమ్మవారిని దర్శించుకుంటా. కరోనా నిబంధనలకు అనుగుణంగా కాలినడకన అమ్మవారిని దర్శించుకున్నాము. దుర్గ గుడి అధికారులు క్యూ లైన్ లలో ఎప్పటికప్పుడు ఇంకా మెరుగ్గా శ్యానిటైజెషన్ […]

దసరా తొలిరోజు దుర్గమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ : దేవినేని ఉమ
Devineni Uma
Follow us

|

Updated on: Oct 17, 2020 | 1:53 PM

బెజవాడ కనకదుర్గ అమ్మవారిని మాజీమంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు దర్శించుకున్నారు. వినాయకుడి గుడి నుండి కాలినడకన క్యూలైన్లో నడుచుకుంటూ కొండపైకి వచ్చి ఉమ.. అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ “అమ్మలగన్నమ్మ దుర్గమ్మను దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం కాలినడకన దసరా తొలి రోజు అమ్మవారిని దర్శించుకుంటా. కరోనా నిబంధనలకు అనుగుణంగా కాలినడకన అమ్మవారిని దర్శించుకున్నాము. దుర్గ గుడి అధికారులు క్యూ లైన్ లలో ఎప్పటికప్పుడు ఇంకా మెరుగ్గా శ్యానిటైజెషన్ పనులు చేపట్టాలి. ప్రజలకు శ్యానిటైజర్స్ క్యూ లైన్స్ లో అందుబాటులో ఉంచాలి. అమరావతి రైతులకు న్యాయం జరగాలి అని అమ్మవారిని కోరుకున్నాను. ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వలన రైతులకు పంట నష్టం వాటిల్లింది.” అని దేవినేని ఉమ చెప్పుకొచ్చారు.