అత్యాచారబాధిత బాలికకు అఖిలప్రియ పరామర్శ

“దిశ చట్టం తెచ్చామని గొప్పలు చెపుతున్న ప్రభుత్వం.. రాష్ట్రంలో ఇప్పడిదాక ఒక్క కేసైనా నమోదు చేసిందా” అని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కర్నూలులో ప్రశ్నించారు. అత్యాచారాలకు పాల్పడుతున్న వారు ఎంతైటి వారైనా, ఏపార్టీకి చెందిన వారైనా కఠినంగా శిక్షించాలని అఖిల ప్రియ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం ప్యాలకుర్తి గ్రామంలో 8వ తరగతి చదువుతున్న బాలికపై శుక్రవారం అసభ్యంగా ప్రవర్తించి దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని అఖిల కోరారు. కర్నూలు ఆసుపత్రిలో […]

  • Venkata Narayana
  • Publish Date - 12:07 pm, Mon, 26 October 20

“దిశ చట్టం తెచ్చామని గొప్పలు చెపుతున్న ప్రభుత్వం.. రాష్ట్రంలో ఇప్పడిదాక ఒక్క కేసైనా నమోదు చేసిందా” అని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కర్నూలులో ప్రశ్నించారు. అత్యాచారాలకు పాల్పడుతున్న వారు ఎంతైటి వారైనా, ఏపార్టీకి చెందిన వారైనా కఠినంగా శిక్షించాలని అఖిల ప్రియ డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం ప్యాలకుర్తి గ్రామంలో 8వ తరగతి చదువుతున్న బాలికపై శుక్రవారం అసభ్యంగా ప్రవర్తించి దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని అఖిల కోరారు. కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధిత బాలికను అఖిలప్రియ పరామర్శించారు. బాధిత కుటుంబానికి తెలుగుదేశం పార్టీ తరుపున అండగా ఉంటామని.. బాలిక తల్లిదండ్రులకు తెలుగుదేశం పార్టీ అన్నివిధాల సహకారం అందిస్తుందని తెలిపారు. బాధిత బాలిక మీడియాతో మాట్లాడుతూ కొందరు అసభ్యంగా ప్రవర్తించారని దాడి కూడా చేశారని తెలిపింది.