కరోనా టెస్టులపై రగడ.. సర్కార్‌పై సంచలన ఆరోపణలు చేసిన మాజీ సీఎం..

మహారాష్ట్రలో పెరుగుతున్న కేసుల విషయంపై ఇప్పుడు రాజకీయ‌ రంగు పులుముకుంటుంది. మహా సర్కార్‌పై మాజీ సీఎం దేవేంద్ర ఫడ్రవీస్‌ సంచలన ఆరోపణలు చేశారు.

కరోనా టెస్టులపై రగడ.. సర్కార్‌పై సంచలన ఆరోపణలు చేసిన మాజీ సీఎం..
Follow us

| Edited By:

Updated on: Jun 13, 2020 | 8:14 PM

కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా విజృంభిస్తోంది. ఇప్పటికే మూడు లక్షల మార్క్‌ను కూడా దాటేసింది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలోనే నమోదవుతున్న సంగతి తెలిసిందే. అక్కడ ఇప్పటికే లక్షకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో ముంబైలోనే సగం వరకు కేసులు నమోదవ్వడం కలకలం రేపుతోంది. అయితే రాష్ట్రంలో పెరుగుతున్న కేసుల విషయంపై ఇప్పుడు రాజకీయ‌ రంగు పులుముకుంటుంది. మహా సర్కార్‌పై మాజీ సీఎం దేవేంద్ర ఫడ్రవీస్‌ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేసులు చేసే సామర్ధ్యం పెద్ద ఎత్తున ఉన్నప్పటికీ.. చేయడం లేదని.. కేసుల సంఖ్య తక్కువగా చూపే ప్రయత్నం చేస్తోందని ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో రోజుకి 38 వేల కరోనా పరీక్షలు చేసే సామర్ధ్యం ఉందని.. అయితే ప్రస్తుతం 14వేల వరకు మాత్రమే కరోనా పరీక్షలు చేస్తున్నారన్నారు. ఇక ఒక్క ముంబై నగరంలోనే రోజుకు 12 వేల కరోనా టెస్టులు చేసే సామర్ధ్యం ఉందని.. అయితే ప్రస్తుతం ప్రభుత్వం 4 వేలు మాత్రమే చేస్తుందని ఆరోపించారు. ఇదిలావుంటే.. మహారాష్ట్రలో రోజుకు మూడు వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.