ఎంపీగా జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రమాణం.. రాజ్యసభలో విపక్షాల వాకౌట్

సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ గురువారం రాజ్యసభలో ఎంపీగా ప్రమాణం చేశారు. ఆయన ప్రమాణం చేస్తుండగా.. కాంగ్రెస్ సహా విపక్షాల సభ్యులు 'షేమ్'. 'షేమ్' (సిగ్గు,సిగ్గు) అని నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.

ఎంపీగా జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రమాణం.. రాజ్యసభలో విపక్షాల వాకౌట్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 19, 2020 | 2:09 PM

సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ గురువారం రాజ్యసభలో ఎంపీగా ప్రమాణం చేశారు. ఆయన ప్రమాణం చేస్తుండగా.. కాంగ్రెస్ సహా విపక్షాల సభ్యులు ‘షేమ్’. ‘షేమ్’ (సిగ్గు,సిగ్గు) అని నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. గొగోయ్ నియామకం జుడీషియరీ స్వత్రంత్రతను దెబ్బ తీస్తుందని వారు ఆరోపించారు. సమాజ్ వాదీ పార్టీ తప్ప ఇతర ప్రతిపక్షాలన్నీ వాకౌట్ చేశాయి. గొగోయ్ ని రాష్ట్రపతి ఎగువసభకు  నామినేట్ చేసిన సంగతి విదితమే. అయితే ఈ సభకు  గొగోయ్ నియామకాన్ని సమర్థించిన న్యాయశాఖ మంత్రి రవిశంకర ప్రసాద్.. మాజీ ప్రధాన న్యాయమూర్తులతో సహా వివిధ రంగాలకు విశేష సేవలందించిన ప్రముఖులను  ఎంపిక చేయడం సంప్రదాయంగా వస్తోందన్నారు.  జస్టిస్ గొగోయ్ తప్పకుండా ఈ సభకు తనవంతు సేవలందిస్తారని, ప్రతిపక్షాలు వాకౌట్ చేయడం సముచితం కాదని ఆయన అన్నారు. అటు-విపక్షాల వాకౌట్ పట్ల ఉపరాష్ట్రపతి, సభ చైర్మన్ వెంకయ్యనాయుడు కూడా నిరసన వ్యక్తం చేస్తూ.. కొన్ని నియామకాలకు నిబంధనలు, సంప్రదాయాలు ఉన్నాయని, విపక్షాలు ఇలా ప్రవర్తించడం భావ్యం కాదని అన్నారు.

జస్టిస్ రంజన్ గొగోయ్ నాలుగునెలల క్రితమే రిటైరయ్యారు. రాజ్యసభకు తన నియామకాన్ని సమర్థించుకున్న ఆయన..జాతి సమైక్యత కోసం ఏదో ఒక దశలో ఎగ్జిక్యూటివ్, (పార్లమెంటరీ వ్యవస్థ), జుడీషియరీ (న్యాయవ్యవస్థ) కలిసి పని చేయవలసి ఉంటుందని పేర్కొన్నారు.

‘పార్లమెంటులో నా ఉనికి లెజిస్లేచర్ ముందు జుడీషియరీ అభిప్రాయాలను, అలాగే జుడీషియరీ ఎదుట పార్లమెంట్ భావాలను ప్రొజెక్ట్ చేయడానికి నాకు లభించిన అవకాశమేనని భావిస్తున్నానని’ ఆయన వ్యాఖ్యానించారు.సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గా తన హయాంలో రంజన్ గొగోయ్.. అయోధ్య సహా కీలకమైన అంశాలపై తీర్పు నిచ్చారు. అయితే ఆయన నియామకం రాజ్యాంగ మౌలిక సూత్రాలకు విరుధ్ధమని, ఒక విధంగా దాడివంటిదేనని కాంగ్రెస్ పార్టీ దుయ్యబట్టింది. జుడీషియరీకి, ఎగ్జిక్యూటివ్ కి మధ్య అధికారాల విభజన ఆధారంగా రాజ్యాంగం ఏర్పడిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు.

ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఈ దేశంలో ఐఫోన్‌పై నిషేధం, భద్రతా కారణాలతో ఈ చర్యలు తీసుకున్నట్లు
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ఆ రెండు స్థానాల్లో కూటమిని కలవరపెడతున్న రెబల్ అభ్యర్థులు..
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
ప్రేమిస్తే ఉన్న మతి పోయింది..! లవేరియా వింత వ్యాధి ఏంటంటే
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
బాలయ్యతో ఉన్న ఈ బుడ్డోడు.. ఇప్పుడు స్టార్ హీరో..!
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఆర్‌డీలపై 9.10%, ఎఫ్‌డీలపై 8.65% వడ్డీ.. పెట్టుబడిదారులకు మంచి..
ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి
ఇంటి మూలల్లో సాలె గూళ్లు ఉన్నాయా.. అది శుభమా.. అశుభమా తెలుసుకోండి
శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..
శరీరంలో ఈ ప్రాంతాల్లో వాపు ఉంటే డేంజర్‌లో ఉన్నట్లే.. బీఅలర్ట్..
ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..
ఇంటికి వచ్చి పడుకున్న ఆ యువకుడు మళ్లీ లేవలేదు.. ఏమైందో తెలుసా..
నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు
నిష్క్రమించే దిశగా ఆర్‌సీబీ.. ప్లేయింగ్ 11లో మార్పులు
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
ఈ జిల్లాలో టీడీపీకి బిగ్ షాక్.. సీఎం జగన్ సమక్షంలో చేరిన సీనియర్
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా