ఇండియాలో ‘ ట్రంప్ తరహా రాజకీయాలు.’ ?… ఇక నిర్బంధ శిబిరాలు !

అమెరికాలో అక్రమ శరణార్థులను ఏరివేసి వారిని వారి, వారి స్వస్థలాలకు పంపివేసేందుకు అధ్యక్షుడు ట్రంప్ డిటెన్షన్ సెంటర్స్ (నిర్బంధ శిబిరాల) ను ఏర్పాటు చేసి.. సంచలనం సృష్టించాడు. పైగా తమ దేశానికి, మెక్సికో కు మధ్య సరిహద్దుల్లో కిలోమీటర్ల పొడవునా పెద్ద గోడ కట్టేందుకు నడుం బిగించాడు. చూడబోతే ఇండియాలో కూడా అలాంటి విచిత్రమైన, వింతైన పోకడతో కూడిన ‘ రాజకీయాలు ‘ ప్రారంభమవుతున్నట్టు కనిపిస్తోంది. ఉదాహరణకు అస్సాంలో బంగ్లాదేశ్ శరణార్థులను, ఇతర అక్రమ వలసదారులను గుర్తించేందుకు […]

ఇండియాలో ' ట్రంప్ తరహా రాజకీయాలు.' ?... ఇక నిర్బంధ శిబిరాలు !
Follow us

|

Updated on: Sep 09, 2019 | 12:24 PM

అమెరికాలో అక్రమ శరణార్థులను ఏరివేసి వారిని వారి, వారి స్వస్థలాలకు పంపివేసేందుకు అధ్యక్షుడు ట్రంప్ డిటెన్షన్ సెంటర్స్ (నిర్బంధ శిబిరాల) ను ఏర్పాటు చేసి.. సంచలనం సృష్టించాడు. పైగా తమ దేశానికి, మెక్సికో కు మధ్య సరిహద్దుల్లో కిలోమీటర్ల పొడవునా పెద్ద గోడ కట్టేందుకు నడుం బిగించాడు. చూడబోతే ఇండియాలో కూడా అలాంటి విచిత్రమైన, వింతైన పోకడతో కూడిన ‘ రాజకీయాలు ‘ ప్రారంభమవుతున్నట్టు కనిపిస్తోంది. ఉదాహరణకు అస్సాంలో బంగ్లాదేశ్ శరణార్థులను, ఇతర అక్రమ వలసదారులను గుర్తించేందుకు అక్కడి ప్రభుత్వం ఎన్నార్సీ (నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్) ని చేపట్టింది. తాజాగా జరిగిన జనాభా లెక్కల సేకరణ జాబితాలో 19 లక్షల మంది అక్రమ వలదారులుగా తేలారు. వీరి జాతీయత ప్రకారం వీరిని తిప్పి పంపే క్రమంలో నిర్బంధ శిబిరాలకు తరలిస్తున్నారు. ఆదివారం అస్సాంను విజిట్ చేసిన హోం మంత్రి అమిత్ షా.. ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్క అక్రమ వలసదారుడిని తరిమివేస్తాం అని ప్రకటించారు. ఇప్పుడు అస్సాం తరహాలోనే మహారాష్ట్రలో కూడా ఇదే ప్రతిపాదన వస్తోంది. ఈ రాష్ట్రంలోనూ ఎన్నార్సీ ని అమలు చేయాలనే ప్రపోజల్ తెరపైకి వచ్చింది.

ఇల్లీగల్ శరణార్ధుల కోసం నిర్బంధ శిబిరం ఏర్పాటుకు భూమిని కేటాయించాలని కోరుతూ నవీ ముంబై అథారిటీకి ఈ రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ లేఖ రాయాలని యోచిస్తోందట. నవీ ముంబైలోని నేరుల్ ప్రాంతంలో మూడు లేదా నాలుగు ఎకరాల స్థలాన్ని కేటాయించాలని కోరుతూ ఆ శాఖ నుంచి తమకు లేఖ అందిందని సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు చెందిన వర్గాలు తెలిపాయి. ఈ ప్రాంతం ముంబైకి 20 కి.మీ. దూరంలో ఉంది. కానీ తాము ఎలాంటి లేఖనూ పంపలేదని మహారాష్ట్ర హోం శాఖ ప్రకటించినప్పటికీ.. కేంద్రం ఈ ఏడాది ఆరంభంలో జారీ చేసిన గైడ్ లైన్స్ ప్రకారం.. దేశంలోని అన్ని ప్రధాన ఇమ్మిగ్రేషన్ పాయింట్ల వద్ద నిర్బంధ శిబిరాలను ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందని పేర్కొన్నట్టు సమాచారం.

రాబోయే కొన్ని నెలల్లో ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. బంగ్లాదేశ్ కు చెందిన అక్రమ వలసదారులు ముంబైలో నివసిస్తున్నారని, వివిధ పనులు చేసుకుంటూ ఇక్కడే స్థిరపడిపోయారని శివసేన చెబుతోంది. అస్సాంలో ఇలాంటివారి కారణంగా సమస్య తలెత్తిందని, అందువల్లే అక్కడ ఎన్నార్సీ అవసరం ఏర్పడిందని ఈ పార్టీ నేత అరవింద్ సావంత్ పేర్కొన్నారు. అలాంటి ప్రక్రియనే మహారాష్ట్రలోనూ చేపట్టాలని ఆయన అంటున్నారు.

NRC ఇక సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో.. దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిని ఏరివేస్తామని హామీ ఇచ్చింది. ఈ దేశంలో ప్రతి అంగుళ భూభాగం నుంచి అక్రమ వలసదారులను తరిమివేస్తామని అమిత్ షా గత జులైలో రాజ్యసభలో పేర్కొన్నారు. నిన్న అస్సాంలో జరిగిన కార్యక్రమంలో కూడా ఆయన ఇదే విధమైన ప్రకటన చేశారు.

అటు-బీహార్ మంత్రివర్గంలో బీజేపీకి చెందిన మంత్రులు కూడా అస్సాం తరహా ప్రక్రియను ఈ రాష్ట్రంలో చేపట్టాలని సూచించారు. గోవాలో గత మే నెలలో ఆ రాష్ట్ర సీఎం ప్రమోద్ సావంత్.. 50 లక్షల వ్యయంతో నిర్మించిన నిర్బంధ శిబిరాన్ని ప్రారంభించారు. అస్సాం లో ఈ విధమైన శిబిరాలను జైళ్లలో నిర్వహిస్తున్నారు. గోల్పార జిల్లాలో మూడు వేల మందిని ‘ నిర్బంధించడానికి ‘ అనువుగా దాదాపు 46 కోట్ల వ్యయంతో ఓ బడా డిటెన్షన్ సెంటర్ ను ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇదంతా చూస్తుంటే.. ఇండియా ఈ విషయంలో ‘ మరో అమెరికా ‘ గా మారబోతోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు.

Detention Centre

చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!