Delhi Corona: ఢిల్లీ జ‌నాభాలో స‌గం మంది క‌రోనా బారిన ప‌డి కోలుకున్నారు: సెరోలాజిక‌ల్ స‌ర్వే వెల్ల‌డి

Delhi Corona: దేశ రాజ‌ధాని అయిన ఢిల్లీలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. ప్ర‌తి ఇద్ద‌రిలో ఒక‌రికి సోకుతుంది. ఢిల్లీ జ‌నాభా సుమారు రెండు కోట్లు కాగా, అందులో ....

Delhi Corona: ఢిల్లీ జ‌నాభాలో స‌గం మంది క‌రోనా బారిన ప‌డి కోలుకున్నారు: సెరోలాజిక‌ల్ స‌ర్వే వెల్ల‌డి
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jan 26, 2021 | 7:44 AM

Delhi Corona: దేశ రాజ‌ధాని అయిన ఢిల్లీలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. ప్ర‌తి ఇద్ద‌రిలో ఒక‌రికి సోకుతుంది. ఢిల్లీ జ‌నాభా సుమారు రెండు కోట్లు కాగా, అందులో స‌గం మంది క‌రోనా బారిన ప‌డి కోలుకున్నార‌ని ఇటీవ‌ల ఐదో సెరోలాజిక‌ల్ స‌ర్వేలో వెల్ల‌డైంది. దేశ రాజ‌ధానిప్రాంతంలో క‌రోనా వ్యాప్తి గురించి తెలుసుకునేందుకు ఢిల్లీ స‌ర్కార్ ఇప్ప‌టికే ప‌లు మార్లు సెరోలాజిక‌ల్ స‌ర్వే నిర్వ‌హించింది. తాజాగా ఈనెల 10 నుంచి 23వ తేదీ వ‌ర‌కు చేప‌ట్టిన ఐదో విడ‌త సెరోస‌ర్వేలో ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ప్ర‌తి మున్సిప‌ల్ వార్డు నుంచి వంద చొప్పున మొత్తం 28 వేల మంది నుంచి న‌మూనాల‌ను సేక‌రించారు.

గ‌త నాలుగు సెరో స‌ర్వేల్లో 23 నుంచి 25 శాతం మందిలోనే యాంటీబాడీలను గుర్తించ‌గా, ఐదో విడ‌త స‌ర్వేల్లో 60 శాతం మందిలో క‌రోనాను త‌ట్టుకునే రోగ‌నిరోధ‌కాల‌ను గుర్తించారు. సుమారు 60శాతం మంది ఢిల్లీ ప్ర‌జ‌ల్లో క‌రోనాను త‌ట్టుకునే ప్ర‌తిరోధ‌కాలు ఉన్న‌ట్లు యాంటీబాడీ ప‌రీక్ష‌ల్లో గుర్తించారు. అంటే దేశ రాజ‌ధానిలోని సుమారు స‌గం మంది ప్ర‌జ‌లు వారికి తెలియ‌కుండానే క‌రోనా మ‌హ‌మ్మారి బారిన‌ప‌డి కోలుకున్న‌ట్లు స‌ర్వేలో తేలింది.

దీంతో ఢిల్లీలోని స‌గం జ‌నాభా క‌రోనాను త‌ట్టుకునే రోగ‌నిరోధ‌క‌శ‌క్తిని క‌లిగి ఉంద‌ని, వారంతా హెర్డ్ ఇమ్యూనిటీ ద‌శ‌కు చేరుకున్నార‌ని స‌ర్వే ద్వారా తేలింది. కాగా, ప్ర‌పంచ వ్యాప్తంగా గ‌త ఏడాదిగా క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్ర ఇబ్బందుల‌కు గురి చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్‌కు ఎలాంటి వ్యాక్సిన్ లేని కార‌ణంగా తీవ్ర స్థాయిలో విజృంభించింది. గ‌త ప‌ది రోజులుగా దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చింది. ఈ వ్యాక్సిన్ కార‌ణంగా కేసుల సంఖ్య త‌గ్గిపోయే అవ‌కాశం ఉంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చినా.. ప్ర‌తి ఒక్క‌రు కూడా మాస్కులు ధ‌రించ‌డం మ‌ర్చిపోవ‌ద్ద‌ని నిపుణులు సూచిస్తున్నారు.

Coronavirus Cases Telangana: తెలంగాణ కరోనా బులిటెన్.. కొత్తగా 148 పాజిటివ్ కేసులు, ఒకరు మృతి..

ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఈ హీరోయిన్‏ను గుర్తుపట్టరా ?.. ఇంత పద్దతిగా ఉన్న అమ్మాయి..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
ఇకపై 24 కాదు 12 గంటల్లోనే! హైదరాబాదీలకు అద్దిరిపోయే వార్త..
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
చిన్నది కదా అని చీప్‌గా చూడకండి.. స్విచ్ ఆన్ చేస్తే చల్ల.. చల్లగా
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
శరీరంలో విటమిన్ B12, విటమిన్ D పని ఏంటి..? తగ్గితే ఏం చేయాలి..
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
మట్టిని తవ్వుతుండగా కనిపించిన పురాతన సీసా.. పైకి తీసి చూడగా
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
హిట్ కోసం వెయిట్ చేస్తున్న సీనియర్లు.! మరీ ఇంత గ్యాప్ ఏంటి.?
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
బైక్ నడుపుతున్న బాలుడు.. తల్లిదండ్రులకు ఐపీఎస్ ఆఫీసర్ విజ్ఞప్తి
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
పవన్‌కు ఎన్ని కోట్ల అప్పులున్నాయో తెలుసా? మొత్తం ఆస్తుల వివరాలివే
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఒకే ఒక్క క్లిక్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..
బార్డర్‌లో భయభయం.. ఏ క్షణమైనా ఏనుగులు సరిహద్దు దాటే అవకాశం..