లాక్‌డౌన్‌ వేళ.. కైట్‌ ఫెస్టివల్ చేసుకున్న మంకీ..!

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలంతా ఇంట్లోనే ఉంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి వస్తున్నారు. అయితే అనేక ప్రాంతాల్లో నిర్మానుష్యంగా మారడంతో.. జంతువులు యథేచ్చగా బయటికి వస్తున్నాయి. ఈ క్రమంలో పలు జంతువులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయి. మొన్నటికి మొన్న ఓ దేశంలో జిబ్రా పార్క్ నుంచి తప్పించుకుని.. రోడ్లపై షో చేసింది. ఇక తాజాగా మరో చోట.. ఓ కోతి గాలిపటం ఎగరవేస్తూ దర్శనమిచ్చింది. ఓ బిల్డింగ్‌పైన ఉండి.. అచ్చం మనుషులు […]

లాక్‌డౌన్‌ వేళ.. కైట్‌ ఫెస్టివల్ చేసుకున్న మంకీ..!
Follow us

| Edited By:

Updated on: Apr 17, 2020 | 7:11 PM

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలంతా ఇంట్లోనే ఉంటున్నారు. అత్యవసర పరిస్థితుల్లోనే బయటికి వస్తున్నారు. అయితే అనేక ప్రాంతాల్లో నిర్మానుష్యంగా మారడంతో.. జంతువులు యథేచ్చగా బయటికి వస్తున్నాయి. ఈ క్రమంలో పలు జంతువులు విచిత్రంగా ప్రవర్తిస్తున్నాయి. మొన్నటికి మొన్న ఓ దేశంలో జిబ్రా పార్క్ నుంచి తప్పించుకుని.. రోడ్లపై షో చేసింది. ఇక తాజాగా మరో చోట.. ఓ కోతి గాలిపటం ఎగరవేస్తూ దర్శనమిచ్చింది.

ఓ బిల్డింగ్‌పైన ఉండి.. అచ్చం మనుషులు ఎగరేసినట్లుగానే.. ఆ కోతి పతంగిని ఎగరేస్తూ.. లాక్‌డౌన్‌లో ఎంజాయి చేస్తోంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. అటవీ అధికారిణి సుసాంతా నందా తన ట్విటర్‌లో ఈ గాలిపటం ఎగరేస్తున్న కోతి వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోకు.. కొతి గాలిపటాన్ని ఎగరేస్తోంది.. అవును ఇది ఖచ్చితంగా కోతే అంటూ క్యాప్షన్ పెట్టారు. ఆ వీడియోలో.. గాలి పటానికి కట్టి ఉన్న దారాన్ని కోతి లాగడం కనిపిస్తోంది.