అయ్యోరామా.. గడ్కరీకీ ఫైన్‌ల బాదుడు తప్పలేదుగా..

Even I Have Paid Fine For Speeding: Says Nitin Gadkari, అయ్యోరామా.. గడ్కరీకీ ఫైన్‌ల బాదుడు తప్పలేదుగా..

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వాహన చట్టం పై నేతల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. చట్టం అమలులోకి వచ్చిన మొదటి రోజు నుంచే అధికారులు చర్యలు ప్రారంభించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి భారీ మొత్తంలో జరిమానాలు వసూలు చేస్తున్నారు. కొత్త వాహన చట్టం కింద నిబంధనలు ఉల్లంఘించి తాను జరిమానా కట్టానని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా తెలిపారు. వాహన చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చిన తానే.. నిబంధనలు ఉల్లంఘించి ఫైన్ కట్టడం షాకింగ్‌గా ఉందని మరికొందరు నేతలు అభిప్రాయపడుతున్నారు. బంద్రా-వర్లీ ప్రాంతంలో అతివేగంగా కారు నడిపినందుకు.. తన కారుకు ఫైన్ వేశారని గడ్కరీ చెప్పారు. కాగా, రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకే ఈ చట్టం తీసుకొచ్చామని అన్నారు.

మోటార్ వెహికిల్ సవరణల చట్టం తీసుకురావడం పట్ల తమ ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని ఆయన చెప్పారు. భారీ జరిమానాల కారణంగా అవినీతి తగ్గుతుందని.. రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా చాలా వరకు నియంత్రించవచ్చని అన్నారు. అంతేకాదు ట్రాఫిక్ నిబంధనలు పాటించేవారు జరిమానాలకు భయపడాల్సిన అవసరం లేదని ఆయన సమర్థించారు. మరోవైపు సామాన్య ప్రజల నుంచి ఈ చట్టానికి వ్యతిరేకత వస్తోంది. ఉన్నట్టుండి చట్టం పేరుతో భారీ మొత్తంలో జరిమానాలు విధిస్తే.. తాము ఎలా కట్టాలని కొందరు విమర్శిస్తున్నారు. అంతేకాదు గతంలో ఎప్పుడో పెండింగ్‌లో ఉన్న చలాన్లకు కూడా మనీ వసూలు చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు. మొత్తానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటార్ వెహికిల్ చట్టం సామాన్యులకే కాదు.. నేతలకు కూడా వణుకు తెప్పిస్తోంది. కొందరైతే ఫైన్ చెల్లించలేక తమ వాహనాలను పోలీసుల వద్దే వదిలేసి వెళుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *