స్పెయిన్‌లో చెలరేగిన కార్చిచ్చు..

స్పెయిన్‌లోని కర్చిచ్చు ఉగ్రరూపం దాల్చింది. కాటలోనియాలోని టోరెడెల్ ఎస్పనాల్ ప్రాంతంలో ఒక్కసారిగా భారీ మంటలు వ్యాపించాయి. మంటల కారణంగా ఇప్పటికే 5,500 హెక్టార్ల వరకూ అడవి కాలిబూడిదైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. మొత్తం 350 మంది ఫైర్ సిబ్బంది, 120 మంది సైనికులు మంటలను ఆర్పుతున్నారు. దాదాపు 20 వేల హెక్టార్ల అడవిని ఈ కార్చిచ్చు దహించివేసే ముప్పు ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా, ప్రమాదానికి […]

స్పెయిన్‌లో చెలరేగిన కార్చిచ్చు..
Follow us

| Edited By:

Updated on: Jun 28, 2019 | 7:13 AM

స్పెయిన్‌లోని కర్చిచ్చు ఉగ్రరూపం దాల్చింది. కాటలోనియాలోని టోరెడెల్ ఎస్పనాల్ ప్రాంతంలో ఒక్కసారిగా భారీ మంటలు వ్యాపించాయి. మంటల కారణంగా ఇప్పటికే 5,500 హెక్టార్ల వరకూ అడవి కాలిబూడిదైంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. మొత్తం 350 మంది ఫైర్ సిబ్బంది, 120 మంది సైనికులు మంటలను ఆర్పుతున్నారు. దాదాపు 20 వేల హెక్టార్ల అడవిని ఈ కార్చిచ్చు దహించివేసే ముప్పు ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాగా, ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.