బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన ఈఎస్ఐ మాజీ డైరెక్టర్…

ఈఎస్​ఐ స్కామ్ లో అరెస్టయిన ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ డాక్టర్​ రమేశ్​కుమార్ బెయిల్ కోరుతూ ఉన్న‌త న్యాయ‌స్థానాన్ని ఆశ్రయించారు. పిటిషన్​పై విచారణ జరిపిన కోర్టు... తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన ఈఎస్ఐ మాజీ డైరెక్టర్...
Follow us

|

Updated on: Jul 10, 2020 | 6:34 PM

ఈఎస్​ఐ స్కామ్ లో అరెస్టయిన ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ డాక్టర్​ రమేశ్​కుమార్ బెయిల్ కోరుతూ ఉన్న‌త న్యాయ‌స్థానాన్ని ఆశ్రయించారు. పిటిషన్​పై విచారణ జరిపిన కోర్టు… తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. ఈఎస్​ఐలో మెడిసిన్ కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణతో ఏసీబీ అధికారులు మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడితో పాటు రమేశ్​కుమార్​ను అరెస్టు చేశారు. కాగా..విజయవాడ యాంటి క‌రెప్ష‌న్ బ్యూరో స్పెష‌ల్ కోర్టులో ఆయన బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం నిరాకరించిన విషయం తెలిసిందే. కాగా ఈ కేసులో తాజాగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ పీఎస్ ను అరెస్ట్ చేశారు ఏసీబీ అధికారులు. పితాని త‌న‌యుడి కోసం గాలింపు సాగిస్తున్నారు.