Breaking క్వారెంటైన్ నుంచి ఇద్దరు గాయబ్

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కరోనా క్వారెంటైన్ సెంటర్ నుంచి ఇద్దరు పారిపోవడం కృష్ణా జిల్లా మైలవరంలో కలకలం రేపుతోంది. వారిద్దరు కూడా తెలంగాణకు చెందిన వారు కావడంతో రాష్ట్ర సరిహద్దులో బలగాలను మోహరించి వెతుకులాట ప్రారంభించారు.

Breaking క్వారెంటైన్ నుంచి ఇద్దరు గాయబ్
Follow us

|

Updated on: Apr 23, 2020 | 6:57 PM

ప్రభుత్వం ఏర్పాటు చేసిన కరోనా క్వారెంటైన్ సెంటర్ నుంచి ఇద్దరు పారిపోవడం కృష్ణా జిల్లా మైలవరంలో కలకలం రేపుతోంది. వారిద్దరు కూడా తెలంగాణకు చెందిన వారు కావడంతో రాష్ట్ర సరిహద్దులో బలగాలను మోహరించి వెతుకులాట ప్రారంభించారు.

మైలవరంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రం నుంచి ఇద్దరు వ్యక్తులు గురువారం ఉదయం పరారయ్యారు. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడకి చెందిన మక్కా వెంకటేశ్వరరావు, నరసమ్మ అనే మహిళ నాలుగు రోజుల క్రితం మైలవరంలోని బంధువులు ఇంటికి వచ్చారు. విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు వారిద్దరినీ మైలవరం క్వారెంటైన్ సెంటర్‌కు తరలించారు. వారిద్దరికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారిని క్వారెంటైన్‌లో వుంచారు.

గురువారం తెల్లవారుజామున వీరిద్దరు క్వారెంటైన్ సెంటర్ వెనుక గేట్ తాలం పగులగొట్టి మరీ పరారైనట్లు సెంటర్‌లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తెలిపారు. క్వారెంటైన్ సిబ్బంది సమాచారం మేరకు పోలీసులు రంగంలోకి దిగారు. మైలవరం నుంచి తెలంగాణ బోర్డర్ వైపు వెళ్ళే మార్గాలలో వెతుకులాట ప్రారంభించారు. కోదాడకు చెందిన వీరిద్దరు ప్రధాన రోడ్ల ద్వారా కాకుండా సరిహద్దులోని పల్లె మార్గంలో కోదాడకు వెళ్ళి వుంటారని భావిస్తున్నారు. సూర్యపేట జిల్లా అధికారులకు సమాచారం అందించిన కృష్ణా జిల్లా పోలీసులు తమ పరిధిలో గాలింపు కొనసాగిస్తున్నారు.

కోదాడలో తేలారు..

మైలవరం క్వారంటైన్  సెంటర్ నుండి పరారైన ఇద్దరి ఆచూకీ గురువారం సాయంత్రానికి లభ్యమైంది. కోదాడలోని తమ నివాసానికి వెళ్లినట్టు గుర్తించారు. వారిద్దరిని కనుగొన్న స్థానిక పోలీసులు కోదాడలోని హోం క్వారంటైన్ కి తరలించారు.