Breaking News
 • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం. శ్రీవారి ఉచిత దర్శనానికి 10 గంటల సమయం. ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.92 కోట్లు. సాయంత్రం వరకు శ్రీవారిని దర్శించుకున్న 45,143 మంది భక్తులు.
 • హైదరాబాద్‌: గచ్చిబౌలిలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి సన్నీబాబు ఆత్మహత్య. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు బావ సంపత్‌కు సన్నీబాబు ఈ మెయిల్‌. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
 • ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో గానాబజానా వ్యవహారంపై ప్రభుత్వం ఆగ్రహం. ఆరుగురు సిబ్బందిపై శాఖాపరమైన విచారణ చేపట్టిన వైద్యారోగ్యశాఖ. హెడ్‌ నర్సులు, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌లు, ఫార్మాసిస్ట్‌లపై.. చర్యలు తీసుకుంటూ ఆదేశాలు జారీ.
 • వరంగల్‌: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర హుండీల లెక్కింపు. 436 హుండీల లెక్కింపు పూర్తి. రూ.10.29 కోట్ల ఆదాయం.
 • రామాయపట్నం పోర్టు పరిధిని నిర్ధారిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు. పోర్టు జియో కోఆర్డినేట్స్‌ను నోటిఫై చేసిన మౌలిక వనరులకల్పన శాఖ. పోర్టు నిర్మించిన ప్రాంతానికి 30 కి.మీ. పరిధిలో.. మరో ఓడరేవు నిర్మించేందుకు వీల్లేకుండా అంగీకారం. రామాయపట్నం పోర్టు నిర్మాణంపై.. డీపీఆర్‌ రూపకల్పనలో భాగంగా పోర్టు పరిధి నిర్ధారిస్తూ ఉత్తర్వులు. ప్రభుత్వానికి వివిధ ప్రతిపాదనలు పంపిన ఏపీ మారిటైమ్‌ బోర్డు. నాన్‌ మేజర్‌ పోర్టుగా రామాయపట్నంను అభివృద్ధి చేయనున్న ప్రభుత్వం.
 • హైదరాబాద్‌: సీసీఎస్‌ పోలీసులకు కరాటే కల్యాణి ఫిర్యాదు. సోషల్ మీడియాలో శ్రీరెడ్డి తనను అసభ్యపదజాలంతో దూషించిందని ఫిర్యాదు. శ్రీరెడ్డిపై 506, 509 ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు. సోషల్‌ మీడియాలో అసభ్య కామెంట్స్ చేయడం చట్టరీత్యా నేరం. సపోర్టింగ్‌ కామెంట్స్ చేసినవారిపై కూడా చర్యలు తీసుకుంటాం -సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ ఏసీపీ ప్రసాద్.

ఈపీఎఫ్‌ఓ గుడ్ న్యూస్.. ఇకపై పీఎఫ్ క్లోజింగ్ డేట్ ఉద్యోగుల చేతుల్లోనే..!

EPFO New Feature, ఈపీఎఫ్‌ఓ గుడ్ న్యూస్.. ఇకపై పీఎఫ్ క్లోజింగ్ డేట్ ఉద్యోగుల చేతుల్లోనే..!

ఒక కంపెనీ నుంచి మరొక కంపెనీకి మారినప్పుడు ఉద్యోగులు తమ పీఎఫ్ ఖాతాలోని డబ్బులను బదిలీ/విత్ డ్రా చేసుకోవడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. గతంలో పని చేసిన సంస్థ డేట్ అఫ్ ఎగ్జిట్‌ను ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌లో నమోదు చేయకపోవడమే ఇందుకు కారణం. ఇప్పటివరకు ఈ సదుపాయం కేవలం సదరు కంపెనీలకు మాత్రమే ఈపీఎఫ్‌ఓ సంస్థ ఇచ్చింది. దీంతో ఉద్యోగులు తీవ్ర తంటాలు పడేవారు. ఇక అలాంటివారి కోసమే ఈపీఎఫ్‌ఓ సరికొత్త సౌకర్యాన్ని అమలులోకి తెచ్చింది. ఇకపై ఉద్యోగులే తమ క్లోజింగ్ డేట్‌ను నమోదు చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది.

నమోదు చేసే ప్రక్రియ ఇలా ఉంది..

 1. ముందుగా యూఏఎన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అవ్వాలి.
 2. ఆ తర్వాత ‘మేనేజ్’ ట్యాబ్‌కు వెళ్లి ‘మార్క్ ఎగ్జిట్‌’ను క్లిక్ చేయాలి.
 3. అక్కడ గత కంపెనీ నుంచి వైదొలిగిన తేదీని.. దానికి గల సరైన కారణాన్ని తెలిపాలి.
 4. ఆ తర్వాత ‘రిక్వెస్ట్ ఓటీపీ’ ఆప్షన్ మీద క్లిక్ చేసి.. వచ్చిన వన్ టైం పాస్వర్డ్‌ను ఎంటర్ చేయాలి.
 5. ఇక చివర్లో అప్డేట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మీ క్లోజింగ్ డేట్ నమోదు పూర్తవుతుంది.

కాగా, ఈ ప్రక్రియను మొదలుపెట్టే ముందు మీరు గతంలో పని చేసిన కంపెనీ సదరు వివరాలను నమోదు చేసిందో లేదో ఒకసారి చెక్ చేయండి. అంతేకాకుండా ఉద్యోగులు తమ క్లోజింగ్ డేట్‌ను పై విధంగా నమోదు చేసుకోవాలంటే ఖచ్చితంగా ఉద్యోగం నుంచి తప్పుకుని రెండు నెలలు పూర్తవ్వాలి. పాత కంపెనీ చివరిసారిగా జమ చేసిన పీఎఫ్ మొత్తం రెండు నెలలు దాటినట్లయితేనే ఈ మార్పులకు వీలుంటుంది.

Related Tags